EPFO: మీరు పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేయాలా.? రూల్స్ మారాయి.. ఇది చేయకపోతే భవిష్యత్‌లో ఇబ్బందులు!

|

Feb 07, 2023 | 5:32 PM

మీరు ఈపీఎఫ్ఓ ఖాతాదారుడు అయితే, ఇదిగో ఈ వార్త మీకోసమే. పీఎఫ్‌ ఖాతా నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పలు నిబంధనలను మార్చింది.

EPFO: మీరు పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేయాలా.? రూల్స్ మారాయి.. ఇది చేయకపోతే భవిష్యత్‌లో ఇబ్బందులు!
Epfo
Follow us on

మీరు ఈపీఎఫ్ఓ ఖాతాదారుడు అయితే, ఇదిగో ఈ వార్త మీకోసమే. పీఎఫ్‌ ఖాతా నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పలు నిబంధనలను మార్చింది. 2023, ఏప్రిల్ 1 నుంచి ఈ న్యూ రూల్స్ అమలులోకి రానున్నాయి. ఇప్పుడు పీఎఫ్ ఖాతాకు పాన్‌ నెంబర్‌ను లింక్ చేయకపోతే, డబ్బు విత్‌డ్రా చేసేటప్పుడు 20 శాతం పన్ను విధించబడుతుంది. ఇక ఒక పీఎఫ్ ఖాతాదారుడు 5 సంవత్సరాలలోపు డబ్బును విత్‌డ్రా చేస్తే, టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఐదేళ్లు దాటితే, టీడీఎస్ పడదు. ఇది మాత్రమే కాదు.. TDS కోసం కనీస పరిమితి రూ. 10 వేలను కూడా బడ్జెట్ 2023లో తొలగించినట్లు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతరామన్ పేర్కొన్నారు.

కొత్త EPFO విత్‌డ్రా రూల్ ఇదే..

కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, పీఎఫ్ ఖాతాకు పాన్ కార్డు లింక్ చేసినవారు తక్కువ టీడీఎస్ చెల్లించడానికి అర్హులు. ఇక ఎవరైతే పీఎఫ్ ఖాతాకు పాన్‌ నెంబర్‌ను లింక్ చేయకపోతే, డబ్బు విత్‌డ్రా చేసేటప్పుడు 20 శాతం పన్ను విధించబడుతుంది. ఈ రూల్ ఏప్రిల్ 2023 నుంచి అమలు చేయబడుతుంది.

టీడీఎస్ ఎప్పుడు వర్తిస్తుంది?

ఒక వ్యక్తి EPFO ఖాతా తెరిచిన 5 సంవత్సరాలలోపు డబ్బును ఉపసంహరించుకుంటే, అతడు TDS చెల్లించాల్సి ఉంటుంది. రూ. 50 వేల కంటే ఎక్కువ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకుంటే, పాన్ కార్డు పీఎఫ్ ఖాతాకు లింక్ అయినట్లయితే.. 10 శాతం టీడీఎస్ మొత్తాన్ని చెల్లించాలి. ఒకవేళ పాన్ లింక్ కాకపోతే, అతడు 20 శాతం TDS చెల్లించాల్సి ఉంటుంది. మరి ఈ 20 శాతం టీడీఎస్ కూడా తగ్గాలన్నా, డబ్బు విత్ డ్రా సమయంలో టాక్స్ తక్కువ పడలన్నా.. కచ్చితంగా పాన్‌ కార్డు నెంబర్‌ను పీఎఫ్ ఖాతాకు లింక్ చేయండి.