
ఈ మధ్య ఓ కామన్ క్వశ్చన్ వినిపిస్తోంది. మెయిన్‌గా స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసిన వారి నుంచి. షేర్స్ ఇంకా పడిపోతాయా, ఈ డౌన్‌ఫాల్ ఎప్పుడు ఆగుతుంది అని అడుగుతున్నారు కంగారుగా. బంగారం-వెండిలో ఇన్వెస్ట్ చేసినవాళ్లు పైకి ఆనందిస్తున్నా.. ఇంకా రేటు పెరుగుతుందా, లేక పడిపోతుందా అని అడుగుతున్నారు అనుమానంగా. ధైర్యంగా పెట్టుబడి పెట్టిన వాళ్లలోనూ భయమే.. చేతిలో రూపాయి ఉంచుకుని ఇన్వెస్ట్‌మెంట్ చేయాలన్నా భయమే. ఓవరాల్‌గా ఓ కన్ఫ్యూజన్ స్టేట్ కనిపిస్తోంది వరల్డ్‌వైడ్‌గా. సింపుల్‌గా కొన్ని క్వశ్చన్స్‌కి ఆన్సర్స్ చెప్పుకుందాం. గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ ఇంకా పెరుగుతాయా, తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా? పెరిగితే ఎందాక, పడిపోతే ఎంతదాకా? స్టాక్ మార్కెట్ డౌన్‌ఫౌల్ ఇంకా కొనసాగుతుందా? మళ్లీ బుల్ రన్ చూస్తామా? ఎప్పుడు ఎలా? అసలు బంగారం ధర తగ్గుతుందా. ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పుకుందాం. విత్ ఎగ్జాంపుల్స్. ఇది మాఘమాసం కదా.. సరిగ్గా గతేడాది మాఘమాసంలో పది గ్రాముల బంగారం ధర 74వేల 500 రూపాయలు. మరి ఇప్పుడు.. ఒక లక్షా 61వేల రూపాయలు. ఎంత డిఫరెన్సో తెలుసా.. అక్షరాలా 86వేల 500. ఇదంతా జస్ట్ ఏడాది గ్యాప్‌లోనే. రెండేళ్ల క్రితం ధర తీసి.. ఇప్పటి ధరలతో పోల్చితే కళ్లు చెదిరిపోతాయి. రెండేళ్ల క్రితం ఇదే మాఘమాసం సమయానికి ఇదే పది గ్రాముల బంగారం ధర జస్ట్ 58వేలకు అటుఇటు అంతే. ఇప్పుడు లక్షా 61వేలు. డిఫరెన్స్.. లక్షా 3వేలు....