
చాలా మందికి బిజినెస్ చేయాలనే ఆలోచన ఉంటుంది. కానీ, వందలో 90 మందికి ఉండే సమస్య పెట్టుబడి. మంచి ప్లాన్, మంచి ఐడియా, బిజినెస్ చేయగల నైపుణ్యం ఉన్నప్పటికీ.. పెట్టుబడికి డబ్బులు లేక వెనకడుగు వేస్తుంటారు. అయితే.. అలాంటి వారికి ఒక అదిరిపోయే విషయం. అదేంటంటే.. పైసా పెట్టుబడి లేకుండా నెలకు లక్ష రూపాయాలు ఇంట్లో కూర్చోని సంపాదించుకోవచ్చు. అయితే అందుకోసం.. మీకు కొంత ఖాళీ స్థలం ఉండాలి. అది కూడా ఎకరాకలకు ఎకరాలు కాదు.. జస్ట్ 2000 చదరపు అడుగులు ఉంటే చాలు. భూమి లేకపోయినా.. ఇంటిపైన 500 చదరపు అడుగులు ఉన్నా సరిపోతుంది. ఏం లేదంటి.. మొబైల్ టవర్ల ఏర్పాటుకు మీ స్థలాన్ని, ఇంటిపై భాగాన్ని లీజ్‌కు ఇచ్చి.. నెలా నెలా డబ్బు సంపాదించుకోవచ్చు. అందుకోసం నేరుగా ఈ టవర్లు ఏర్పాటు చేసే కంపెనీలను మనం సంప్రదించవచ్చు.
మొబైల్ టవర్లు ఇన్‌స్టాల్ చేసి నిర్వహణ బాధ్యతలు చూసే కంపెనీలు జీటీఎల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, ఇండస్ టవర్స్, మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్, హెచ్‌ఎఫ్‌సీఎల్, టాటా కమ్యూనికేషన్స్, టాటా టెలిసర్వీసెస్, తేజస్ వంటి కంపెనీలను సంప్రదిస్తే వాళ్లే టవర్ ఏర్పాటు చేసి.. నెలకు ఇంత రెంట్ మనకు చెల్లిస్తారు. జియో, ఎయిర్‌టెల్ సహా ఇతర కంపెనీలు కూడా సొంతంగా టవర్లు ఏర్పాటు చేస్తున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి