
ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించేందుకు ఎన్‌హెచ్ఏఐ ఎప్పికప్పుడూ సరికొత్త విధానాలను తీసుకొస్తుంది. తాజాగా జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారుల కోసం క్యూఆర్ కోడ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. హైవేపై మైలు రాళ్లు, టోల్ ప్లాజాల వద్ద క్యూఆర్ కోడ్ బోర్డులను ఏర్పాటు చేస్తోంది. జస్ట్ వీటిని స్కాన్ చేస్తే చాలూ మనం ఎంత టోల్ కట్టాలి, మనకు దగ్గర్లో పెట్రోల్ బంకులు, హోటళ్లు ఏమున్నాయి. అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు ఇలా పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ఎదురువుతున్న గూగుల్ మ్యాప్స్ సమస్యలకు చెక్ పెట్టేందుకే NHAI ఈ కొద్ద క్యూఆర్ కోడ్ విధానాన్ని తీసుకొచ్చింది.
సాధారణంగా మనకు దగ్గర్లో ఏవైనా పెట్రోల్ బంకులు లేదా రెస్టారెంట్ వంటి ఎమర్జెన్సీ సేవల గురించి తెలుసుకోవాలంటే మనం గూగుల్ మ్యాప్స్ లేదా ఎవరినైనా అడిగి తెలుసుకుంటాం. కానీ మనకు ఇవేవి అందుబాటులో లేకుంటాయి. లేదా గూగుల్ మ్యాప్స్ ఖచ్చితమైన సమాచారం ఇవ్వకపోవచ్చు. అలాంటి సమయాల్లో ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఈ క్యూఆర్ కోడ్ స్కానర్స్ సమాచారాన్ని అందిస్తాయి. ఇది ప్రయాణికుల సమయాన్ని సైతం ఆదా చేస్తోంది. ప్రస్తుతం ఖమ్మం-దేవరపల్లి హైవేపై మీరు ఈ స్కాన్ బోర్డులను చూడవచ్చు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని మరికొన్ని హైవేలనూ కూడా వీటిని ఏర్పాటు చేసేందుకు అధికారులు ట్రై చేస్తున్నారు.
స్కాన్‌తో లభించే సేవలు ఇవే..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.