Central Government: గుడ్‌న్యూస్.. ఫోన్‌లో ఫొటో పంపిస్తే మీ అకౌంట్లోకి రూ.1000.. కేంద్ర ప్రభుత్వం నుంచే..

కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. మీరు ఫోన్‌లో ఒక చిన్న ఫొటో తీసి పంపిస్తే చాలు.. రూ.వెయ్యి ఫాస్టాగ్ రీఛార్జ్ ఉచితంగా అందిస్తోంది. మీ ఫొన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ యాప్ ఉపయోగించి మీరు ఈ పని చేయవచ్చు

Central Government: గుడ్‌న్యూస్.. ఫోన్‌లో ఫొటో పంపిస్తే మీ అకౌంట్లోకి రూ.1000.. కేంద్ర ప్రభుత్వం నుంచే..
Money

Updated on: Feb 13, 2026 | 7:00 AM

వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. నేషనల్ హైవేలపై పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చేందుకు ప్రత్యేక క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం పేరే క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్. జూన్ 30 వరకు ఈ ఛాలెంజ్ నిర్వహించనుండగా.. ఇందులో పాల్గొని టోల్‌గేట్ల వద్ద ఫొటోలు తీసి పంపిస్తే ఉచితంగా రూ.వెయ్యి ఫాస్టాగ్ రీఛార్జ్ అందించనుంది. వాహనదారులకు ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. మీరు చేయాల్సింది ఏమీ లేదు.. జస్ట్ చిన్న ఫొటో ఫోన్‌లో తీస్తే చాలు. అసలు ఈ ఛాలెంజ్ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

రూ.వెయ్యి ఫ్రీ

నేషనల్ హైవేస్‌పై టోల్ గేట్ల దగ్గర వాహనదారులకు టాయిలెట్లు అందుబాటులో ఉంటాయి. అయితే టోల్ గేట్ నిర్వాహకులు వీటి నిర్వహణను పట్టించుకోవడం లేదు. దీంతో వాష్ రూమ్స్ అపరిశుభ్రంగా ఉండటం వల్ల వాహనదారులు ఉపయోగించుకోలేకపోతున్నారు. దీంతో మీరు టోల్ గేట్ల వద్ద శుభ్రంగా లేని టాయిలెట్లను ఫొటో తీసి పంపిస్తే రూ.వెయ్యి ఫాస్టాగ్ రీఛార్జ్ ఉచితంగా అందించనుంది. మందుగా ఎవరైతే పంపుతారో వారి ఫాస్టాగ్ అకౌంట్‌లో ఈ నగదు జమ చేస్తారు. ఈ విషయాన్ని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(NHAI) తన ఎక్స్ అకౌంట్‌లో తెలిపింది.

ఎలా పంపాలంటే..?

రాజమార్గ్ యాత్ర యాప్ ద్వారా వాహనదారులు ఫొటోలను పంపించాల్సి ఉంటుంది. అపరిశుభ్రంగా ఉన్న జియో ట్యాగ్ మరుగుదొడ్ల ఫొటోలను ఈ యాప్‌ ద్వారా పంపించాలి. టాయిలెట్ ఫొటో, ప్రాంతంతో పాటు వాహనదారుడి పేరు, వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మీరు ముందు పంపిస్తే మీ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్‌తో లింక్ అయిన ఫాస్టాగ్ అకౌంట్లో రూ.వెయ్యి జమ చేస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టోల్ గేట్ల వద్ద ఇది వర్తిస్తుంది. ఎన్‌హెచ్‌ఏఐ పరిధిలోని టోల్ గేట్ల వద్ద టాయిలెట్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఒక టోల్ గేట్ వద్ద టాయిలెట్లకు ఒక రోజు మాత్రమే రివార్డ్ ఇస్తారు.  మీరు ఫొటో పంపేటప్పుడు జియో ట్యాగ్ చేసి టైమ్ స్టాంప్ ఉండేలా చూసుకోవాలి. అలా అయితేనే మీకు రూ.వెయ్యి రీఛార్జ్ వస్తుంది.  ముందు ఎవరైతే పంపారో వారిని గుర్తించి వీటిని అందిస్తారు. హైవేలపై వాహనదారులకు సౌకర్యవంతమైన సౌకర్యాలు అందించేందుకు కేంద్రం ఈ ఛాలెంజ్‌ను ప్రారంభించింది. దీని వల్ల టాయిలెట్లు శుభ్రంగా ఉంచుతారని ఆశిస్తోంది. మీరూ మీ ఛాలెంజ్‌లో పాల్గొనాలనుకుంటున్నారా.. ఇంకెందుకు ఆలస్యం. మీకు టోల్ గేట్ల దగ్గర శుభ్రంగా లేని వాష్ రూమ్స్ కనిపిస్తే ఫొటో తీసి పంపండి.