
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) బ్యాంకింగ్ రూల్స్‌లో కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. బ్యాంకింగ్ కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చేలా అనేక రూల్స్‌లో మార్పులు చేసింది. ఇందుకోసం ఇప్పటివరకు ఉన్న బ్యాంకింగ్ నిబంధనలు, నియమాలను మార్చుతోంది. అందులో భాగంగా తాజాగా బ్యాంకులకు ఆర్బీఐ కీలక గైడ్ లైన్స్ జారీ చేసింది. అవేంటంటే.. ఇక నుంచి బ్యాంకులు మోసపూరిత బీమా, ఎన్‌పీఎస్, ఇతర ఆర్ధిక ఉత్పత్తులను తప్పుగా అమ్మడానికి వీల్లేకుండా కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఈ ఉల్లంఘనలకు పాల్పడితే రీఫండ్, పరిహారం కస్టమర్లకు అందించాల్సి ఉంటుది. అలాగే ఆర్బీఐ కఠిన చర్యలకు ఉపక్రమించనుంది. ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం.
– ఉత్పత్తులను విక్రయించే ఏజెంట్లను బ్యాంక్ సిబ్బంది నుంచి వేరు చేయాలి
– బ్యాంకులు అమ్మకాల ప్రవర్తనా నియమావళి రూపొందించుకోవాలి
– నిబంధనలను ఉల్లంఘించే బ్యాంకులు జరిమానా విధించుకోవచ్చు
– వివిధ సేవలు, ప్రొడక్ట్స్‌కు విడివిడిగా ఆమోదం పొందాలి.. అన్నింటిని కలిపి ఉంచకూడదు
– నిబంధనలను చదవపోతే కస్టమర్లకు ఆమోదం ఇవ్వలేని విధంగా ఇంటర్‌ఫేస్‌లో మార్పులు చేయాలి
– బ్యాంకులు థర్డ్ పార్టీ ఉత్పత్తులను నేరుగా ప్రమోట్ చేయకూడదు
– బ్యాంకు ఉద్యోగుల వల్లే ఏజెంట్ల ప్రవర్తన ఉండకూడదు
– ముందస్తు అనుమతి లేకుండా కస్టమర్లకు ఏజెంట్లు లేదా సిబ్బంది కాల్ చేయకూడదు లేదా కలవకూడదు
– ప్రొఫైల్, వయస్సు, ఆదాయం, ఆర్ధిక సమాచారం, రిస్క్ తీసుకునే సత్తా ఆధారంగా ఉత్పత్తులను విక్రయించాలి
– తప్పుదారి పట్టించే సమాచారం లేదా కస్టమర్ అనుమతి లేకుండా సేవలను అమ్మడం చేయకూడదు
– ఆఫర్‌ను పొడిగించేందుకు రెండో బీమా పాలసీ కొనుగోలు చేయడం వంటివి చేయకూడదు
– బ్లాక్ ఆర్గారిధమ్ ఉపయోగించి కస్టమర్లను మోసం చేసేలా ఏ పని చేయకూడదు
ఒకవేళ తప్పుగా కస్టమర్లకు ఉత్పత్తులు అమ్మితే తిరిగి నగదు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే లావాదేవీలను రద్దు చేయాల్సి ఉంటుంది. దాని వల్ల కలిగిన ఆర్ధిక నష్టానికి సరియైన పరిహారం అందించాల్సి ఉంటుంది. ప్రొడక్ట్ అమ్మిన 30 రోజుల తర్వాత కస్టమర్లకు ఫోన్ చేసి అభిప్రాయం అడగాలి. బ్యాంకులు ప్రతీ ఆరు నెలలకు ఒకసారి ఫలితాలపై నివేదికను సిద్దం చేసుకోవాలి. జులై 1వ తేదీ నుంచి ఈ నియమాలు అమల్లోకి వస్తాయని ఆర్బీఐ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. కాగా ఏవైనా తప్పుడు ఉత్పత్తులు అమ్మితే బ్యాంకులకు కస్టమర్లు ఫిర్యాదు చేయాలి. 30 రోజుల్లోగా ఫిర్యాదు చేయాల్సి ఉంటుందని ఆర్బీఐ తన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. ఈ కొత్త నియమాలతో బ్యాంకింగ్ కస్టమర్లకు మరింత రక్షణ ఏర్పడనుంది.