
HDFC: దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకులలో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్ తన లాకర్ అద్దెలను పెంచి కొత్త రేట్లను విడుదల చేసింది. మీరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో లాకర్ కలిగి ఉంటే ఈ వార్త మీకు చాలా ముఖ్యం. బ్యాంక్ మెట్రో ప్లస్ అనే కొత్త కేటగిరీని ప్రవేశపెట్టింది. వివిధ నగరాలు, లాకర్ పరిమాణాల ఆధారంగా వార్షిక అద్దెను పెంచుతుంది. ఈ కొత్త రేట్లు ఏప్రిల్ 1, 2026 నుండి అమలులోకి వస్తాయి.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన లాకర్ అద్దెలను పెంచింది. కొత్త మెట్రో ప్లస్ కేటగిరీని కూడా ప్రవేశపెట్టింది. కొత్త వ్యవస్థ కింద లాకర్ అద్దెలు బ్రాంచ్ స్థాన వర్గం – మెట్రో ప్లస్, మెట్రో, అర్బన్, సెమీ-అర్బన్, గ్రామీణ, లాకర్ పరిమాణం ఆధారంగా నిర్ణయిస్తారు. అన్ని రేట్లపై 18% GST వర్తిస్తుంది. ఇటీవలి కాలంలో బ్యాంకు దొంగతనాలు జరిగిన నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ భద్రతా నిబంధనలను కఠినతరం చేసింది. ఇప్పుడు లాకర్ యాక్సెస్ కోసం ఆధార్-లింక్డ్ బయోమెట్రిక్ ప్రామాణీకరణ తప్పనిసరి అవుతుంది. అంటే లాకర్ తెరవడానికి ముందు కస్టమర్లు బయోమెట్రిక్‌గా గుర్తించనున్నారు. కొత్త లాకర్ రేట్లు ఈ కింది విధంగా ఉన్నాయి.
HDFC బ్యాంక్ వార్షిక లాకర్ అద్దె
మెట్రో కేటగిరీ:
పట్టణ, సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో అద్దెలు తక్కువగా ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో అదనపు-చిన్న లాకర్ల అద్దెలు రూ.1,000 నుండి ప్రారంభమై అదనపు-పెద్ద లాకర్లకు రూ.8,000 వరకు ఉంటాయి.
ఇది కూడా చదవండి: Income Tax: ఇదేంది మావ సీన్ రివర్స్ అయ్యింది.. ఈమె ప్లాన్ అట్టర్‌ప్లాప్.. అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి