IPO News: 60% పతనమైన Nykaa, Paytm, Zomato విలువ.. ఇన్వెస్టర్ల భవిష్యత్తు బంగారమేనట ఎందుకంటే..!

|

May 08, 2022 | 6:40 AM

IPO News: గత సంవత్సరం లిస్ట్ అయిన IPOల్లో కొత్త-తరం స్టార్టప్‌లు Zomato, Policy Bazaar, Nykaa అలాగే Paytm వంటి సంస్థలకు 2022 సంవత్సరం ఒక పీడకలగా మారింది. జనవరి నుంచి ఈ షేర్లు వాటి విలువలో దాదాపు 60% వరకు నష్టపోయాయి.

IPO News: 60% పతనమైన Nykaa, Paytm, Zomato విలువ.. ఇన్వెస్టర్ల భవిష్యత్తు బంగారమేనట ఎందుకంటే..!
Ipo
Follow us on

IPO News: గత సంవత్సరం లిస్ట్ అయిన IPOల్లో కొత్త-తరం స్టార్టప్‌లు Zomato, Policy Bazaar, Nykaa అలాగే Paytm వంటి సంస్థలకు 2022 సంవత్సరం ఒక పీడకలగా మారింది. జనవరి నుంచి ఈ షేర్లు వాటి విలువలో దాదాపు 60% వరకు నష్టపోయాయి. దీని కారణంగా వాటి మార్కెట్ క్యాప్‌లో భారీ పతనం వచ్చింది. ఈ కంపెనీలకు సమబంధించి ఈ ట్రెండ్ కొనసాగుతుందని ఆర్ధిక నిపుణులు భావిస్తున్నారు. Policy bazaar (PB Fintech), Nykaa (FSN ఈ-కామర్స్ వెంచర్), Paytm (One 97 కమ్యూనికేషన్స్) నవంబర్ 2021లో స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అయ్యాయి. Zomato షేర్లు గత ఏడాది జూలై 27న ట్రేడింగ్ ప్రారంభించాయి. వీటిలో మూడు Nykaa, Paytm, Zomato ఈ ఏడాది ఫిబ్రవరిలో నిఫ్టీ నెక్స్ట్- 50 ఇండెక్స్‌లో చేర్చడం జరిగింది. అయినా.. ఇప్పటివరకూ ఎంతో ఆశగా వీటిలో ఇన్వెస్ట్ చేసినవారికి నిరాశే మిగిలింది.

మూడొంతులు పడిపోయిన వ్యాల్యుయేషన్..

లిస్టింగ్ తర్వాత Paytm (One97 కమ్యూనికేషన్స్) పరిస్థితి అధ్వానంగా మారిపోయింది. నవంబర్ 2021 నుంచి దీని వాల్యుయేషన్ 75% కంటే ఎక్కువ తగ్గిపోయింది. జొమాటో మార్కెట్ క్యాప్ కూడా శుక్రవారం సగానికిపైగా తగ్గి రూ.47,625 కోట్లకు చేరుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో ఇది 1.11 లక్షల కోట్లకు పైగా ఉంది. పాలసీబజా, Nykaa విలువలు కూడా 30-40% మేర క్షీణించాయి. NSE ఫిబ్రవరి చివరి నాటికి నిఫ్టీ నెక్స్ట్- 50 ఇండెక్స్‌లో Paytm, Nykaa, Zomato ఉన్నాయి. అంటే దేశంలోని పెద్ద కంపెనీలు నిఫ్టీ 50లో చేర్చిన తర్వాత కంపెనీలు ఈ కేటగిరీలోకి వస్తాయి.

5 ఏళ్ల పాటు లాభాలను ఆశించవద్దు..

ఈ కొత్తతరం టెక్నాలజీ కంపెనీలు చాలా కాలం తర్వాత లాభదాయకంగా ఉంటాయి. కొత్త టెక్నాలజీ సాయంతో ఈ కంపెనీలు కొత్త మార్కెట్‌ను సృష్టించుకున్నాయని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ ఎస్ రంగనాథన్ తెలిపారు. Zomato, Policy bazaar, Paytm లాభాలను ఆర్జించడానికి మరో 5 సంవత్సరాలు పడుతుందని ఆయన అంటున్నారు. పెట్టుబడిదారులు దీనిని అర్థం చేసుకున్నారని ఆయన అన్నారు . ఫలితం ముందు ఉంటుందని రంగనాథన్ అన్నారు. భవిష్యత్ లో ఈ కంపెనీల లాభదాయకత చాలా ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Lasya Manjunath: ర్యాప్‌ సాంగ్‌తో అదరగొట్టిన లాస్య.. తల్లీబిడ్డలందరికీ అంకితం అంటూ..

Tea Party on Everest: ఎక్కడా లేనట్టు ఎవరెస్ట్‌పై టీ పార్టీ.. అయితేనేం రికార్డ్‌ కొట్టేశారు..