Business Idea: దేశీ కోళ్ల పెంపకం.. పెట్టుబడి ఎంత కావాలి? ఆదాయం ఎలా ఉంటుందంటే?

పల్లెటూర్లలో తక్కువ పెట్టుబడితో లాభాలు ఆర్జించాలనుకునే యువతకు దేశీ కోళ్ల పెంపకం గొప్ప అవకాశం. తక్కువ పెట్టుబితో ఈ వ్యాపారం ప్రారంభించి, అధిక ఆదాయం పొందవచ్చు. తక్కువ ఖర్చు, స్థానికంగా డిమాండ్ ఉన్న దేశీ కోళ్లు, గుడ్ల విక్రయం ద్వారా గ్రామీణ యువత ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చు.

Business Idea: దేశీ కోళ్ల పెంపకం.. పెట్టుబడి ఎంత కావాలి? ఆదాయం ఎలా ఉంటుందంటే?
Native Chicken Farming

Updated on: Apr 18, 2026 | 9:30 AM

పల్లెటూరుల్లో తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం అందించే వ్యాపారాలపై యువతలో ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది. ముఖ్యంగా కేవలం రూ.50 వేలతో ప్రారంభించగల దేశీ కోళ్ల పెంపకం (నేటివ్ చికెన్ ఫార్మింగ్) ఇప్పుడు గ్రామీణ యువతకు లాభదాయకమైన బిజినెస్‌గా మారుతోంది. వ్యవసాయం ఆధారిత జీవనశైలిలో భాగంగా ఉండే ఈ వ్యాపారం, తక్కువ ఖర్చుతో ప్రారంభించవచ్చు. స్థానికంగా లభించే దేశీ కోళ్లు ఆరోగ్యానికి మంచివి కావడంతో, మార్కెట్‌లో వీటికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ప్రారంభ దశలో 40–50 కోళ్లను కొనుగోలు చేసి, చిన్న షెడ్ ఏర్పాటు చేస్తే సరిపోతుంది. మిగిలిన మొత్తాన్ని ఆహారం, మందులు, ప్రాథమిక సంరక్షణ కోసం వినియోగించవచ్చు.

దేశీ కోళ్లు సాధారణ బ్రాయిలర్ కోళ్లతో పోలిస్తే తక్కువ సంరక్షణతోనే పెరుగుతాయి. వీటిని ఎక్కువగా ఓపెన్ ఏరియాలో పెంచవచ్చు, కాబట్టి ఖర్చులు కూడా తగ్గుతాయి. ముఖ్యంగా గ్రామాల్లో అందుబాటులో ఉండే ధాన్యాలు, మిగిలిన ఆహారంతో కూడా వీటిని పోషించవచ్చు. 4–5 నెలల్లో కోళ్లు విక్రయానికి సిద్ధమవుతాయి. ఈ వ్యాపారం ద్వారా రెండు విధాలుగా ఆదాయం పొందవచ్చు, కోళ్ల అమ్మకం, గుడ్ల విక్రయం. దేశీ కోడి గుడ్లకు నగరాల్లో కూడా మంచి ధర లభిస్తుంది. ఒక్క గుడ్డు రూ.10–రూ.15 వరకు అమ్ముడవుతుంది. అలాగే పెద్ద కోళ్లు ఒక్కటి రూ.500–రూ.800 వరకు అమ్మే అవకాశం ఉంది.

అదనంగా ఈ వ్యాపారాన్ని క్రమంగా విస్తరించే అవకాశం కూడా ఉంది. ప్రారంభంలో చిన్న స్థాయిలో మొదలుపెట్టి, లాభాలను మళ్లీ పెట్టుబడిగా పెట్టి కోళ్ల సంఖ్యను పెంచుకోవచ్చు. సరైన మార్కెటింగ్ చేస్తే సమీప పట్టణాలకు సరఫరా చేసి మరింత ఆదాయం పొందవచ్చు. అయితే వ్యాధుల నివారణ, శుభ్రత, సమయానికి ఆహారం వంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. స్థానిక పశువైద్యుల సలహాలు తీసుకుంటే నష్టాలను తగ్గించుకోవచ్చు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us