ఎప్పుడైతే ఉద్యోగంలో చేరుతారో అప్పటి నుంచే పదవీ విరమణ కోసం ప్రణాళికలు చేసుకోవడం ఉత్తమం. అలా చేయడం వల్ల.. ఉద్యోగ విరమణ పొందిన తరువాత చేతికి పెద్ద మొత్తంలో డబ్బు అందడంతో పాటు.. శేష జీవితం ప్రశాంతంగా, టెన్షన్ లేకుండా సాగిపోతుంది. పదవీ విరమణ తరువాత ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు పొందడంతో పాటు.. నెలవారీ పెన్షన్ కూడా పొందవచ్చు. తద్వారా లైఫ్ సెక్యూర్ ఉంటుంది. అలాంటి వాటిలో జాతీయ పెన్షన్ స్కీమ్ ఉత్తమమైనది. ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా పదవీ విరమణ చేసినప్పుడు కనీసం రూ. 1 కోటి మీ చేతికి అందుతుంది.
నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో ప్రతి రోజూ కేవలం రూ. 74 పెట్టుబడి పెట్టాలి. మీ వయసు 20 సంవత్సరాలు అనుకుంటే.. పదవీ విరమణకు ఇప్పటి నుంచే ప్లాన్స్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇలా చేయడం ద్వారా రిటైర్మెంట్ తరువాత భారీ మొత్తంలో డబ్బు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అయితే, రోజూ 74 రూపాయలు ఆదా చేయడం అనేది పెద్ద సమస్య కూడా కాదు. ఎన్‌పిఎస్‌లో నిధులు స్టాక్ మార్కెట్, ఇతర సంస్థల్లో పెట్టుబడులు పెడతాయి. ఇందులో కార్పొరేట్, ప్రభుత్వ బాండ్లు ఉంటాయి. సాధారణంగా ఈక్విటీ మొత్తంలో 75శాతం వరకు ఉంటుంది. పీపీఎఫ్, ఈపీఎఫ్ తో పోలిస్తే.. ఎన్‌పీఎస్‌లో పెట్టుబడి పెట్టడం వలన మెరుగైన రాబడిని పొందేందుకు ఆస్కారం ఉంటుంది.
ఎన్‌పీఎస్ ద్వారా మిలియనీర్ కావాలనుకుంటే.. ఈ చిన్న పని చేస్తే సరిపోతుంది. ప్రస్తుతం మీ వయస్సు 20 ఏళ్లు అనుకుంటే.. ప్రతి రోజూ 74 రూపాయలు, నెలవారీగా రూ. 2,230 ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేయాలి. 40 ఏళ్ల తరువాత అంటే 60 ఏళ్లకు రిటైర్ అయ్యాక మీ చేతికి కోటి రూపాయలు అందుతాయి. 9 శాతం రాబడితో పదవీ విరమణ సమయానికి రూ. 1.03 కోట్లు చేతికి అందుతాయి. అలాగే.. మీరు బతికున్నంత కాలం నెల వారీగా పెన్షన్ కూడా వస్తుంది.
అలాగే, మీరు 20 సంవత్సరాల వయస్సులో ఎన్‌పీఎస్‌లో నెలవారీగా రూ. 2230 పెట్టుబడి పెట్టడం ద్వారా 9 శాతం వడ్డీరేటుతో రాబడిని పొందే అవకాశం ఉంది. ఇలా 40 సంవత్సరాలు పెట్టుబడి పెట్టాలి. అయితే, ఈ పెట్టుబడిలో 60 శాతం డబ్బును మాత్రమే ఒకేసారి విత్‌డ్రా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మిగిలిన 40 శాతం నెలవారీ పెన్షన్ పొందే యాన్యూటీ ప్లాన్‌లో తప్పనిసరిగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మీ మూలధనంలో 40 శాతం యాన్యూటీలో పెట్టుబడి పెడితే.. 60 ఏళ్ల వయసులో రూ. 61.86 లక్షలు చేతికి అందుతాయి. నెలవారీగా పెన్షన్ సుమారు రూ. 27,500 వరకు వస్తుంది. అయితే, ఇందులో మార్పులు ఉండే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..