
కొత్తగా ఇన్వెస్ట్ మెంట్ చేసేవారికి మొదట్లో కాస్త గందరగోళంగా అనిపించడం కామన్. ముందు అసలు ఏ ఫండ్ సరైనది అన్న దగ్గర డౌట్ మొదలవుతుంది. మార్కెట్లో ఎన్నో ఫండ్స్ ఉన్నాయి. అందులో కొన్ని మంచి రిటర్న్స్ ఇస్తుంటాయి. మరికొన్ని నష్టాల్లో నడుస్తుంటాయి. వీటిలో మీకు ఏది సూట్ అవుతుంది.. అని ఎలా తెలుస్తుంది? ఇలాంటప్పుడే స్మార్ట్ గా ఆలోచించాలి.
మొదటిసారి పెట్టుబడి పెట్టేవాళ్లు ముందు ఇండెక్స్ ఫండ్స్ తో జర్నీ మొదలు పెట్టడం బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు. ఇండెక్స్ ఫండ్స్ అంటే నిఫ్టీ లేదా బీఎస్ ఈ మార్కెట్లో మంచిగా పర్ఫార్మ్ చేస్తున్న ఫండ్స్. ఉదాహరణకు నిఫ్టీ 50 ఫండ్ అంటే నిఫ్టీలో టాప్ లో ఉన్న 50 కంపెనీల్లో మీ డబ్బు ఇన్వెస్ట్ మెంట్ గా మారుతుంది. ఏ కంపెనీలు టాప్ 50లో ఉంటే ఆ కంపెనీల్లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నట్టు. ఇందులో రిస్క్ అనేది తేలికగా తెలుసుకోవచ్చు. నిఫ్టీ ఇండెక్స్ పడిపోతుంటే మీ ఫండ్ వాల్యూ తగ్గుతుంది. నిఫ్టీ పెరుగుతుంటే మీ ఫండ్ వాల్యూ పెరుగుతుంది. మొదటిసారి ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేవాళ్లు ఇలాంటి ఫండ్ తో స్టా్ర్ట్ చెయొచ్చని నిపుణుల సలహా.
ఇక రెండో ఆప్షన్ బ్యాలెన్స్‌డ్ ఫండ్లు. కొత్తగా ఎస్ఐపీ (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) మొదలుపెట్టే వాళ్లకి బ్యాలెన్స్‌డ్ ఫండ్లు మంచివి. బ్యాలెన్స్ డ్ అంటే స్టాక్ మార్కెట్, డెట్ మార్కెట్.. రెండింటిలో పెట్టుబడి పెడతారు. ఈ ఫండ్స్ లో సేఫ్టీ ఎక్కువగా ఉంటుంది. రిస్క్ తక్కువ తీసుకుంటూ మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది.
ఇకపోతే మీరు పూర్తిగా ఈక్విటీలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఫ్లెక్సి క్యాప్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టొచ్చు. అంటే లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ కంపెనీల్లో మీ డబ్బు ఇన్వెస్ట్ అవుతుంది. ఈ మూడింటిలో ఒకేసారి పెట్టుబడి పెట్టడం వల్ల రిస్క్ కొంచెం తగ్గుతుంది. లాభాలు కూడా స్థిరంగా ఉంటాయి.
ఇక అన్నింటికంటే ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేముందు ఆయా డాక్యుమెంట్లు క్షుణ్ణంగా చదివి నిర్ణయం తీసుకోవాలి. మీకు నమ్మకమున్న ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా మేరకు పెట్టుబడులు పెట్టాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి