Multibagger Stocks: బ్రోకరేజ్ మోతీలాల్ ఓస్వాల్ గోద్రెజ్ కన్స్యూమర్ (GCPL) షేర్లను 29 శాతం సంభావ్య లాభంతో ఏడాది కాలానికి కొనుగోలు చేయాలని సిఫార్సు చేసింది. GCPLపై 10 సంవత్సరాల పాటు తటస్థ దృక్పథాన్ని కొనసాగించిన తర్వాత, బ్రోకరేజ్ సంస్థ ప్రస్తుతం FY22లో దాని అవకాశాలపై పూర్తి సానుకూలంగా ఉంది.
గోద్రెజ్ కన్స్యూమర్ ప్రస్తుత మార్కెట్ ధర (CMP) రూ.888గా ఉంది. బ్రోకరేజ్ సంస్థ, మోతీలాల్ ఓస్వాల్ సిఫార్సు ప్రకారం స్టాక్ టార్గెట్ ధర రూ. 1150గా అంచనా వేసింది. అందువల్ల స్టాక్ ఏడాది టార్గెట్ వ్యవధిలో 29 శాతం రాబడిని ఇస్తుందని పేర్కొంది.
గోద్రెజ్ గ్రూప్ భారతదేశంలో 1897లో స్థాపించారు. ప్రస్తుతం US$4.1 బిలియన్లకు పైగా భారీ ఆదాయాన్ని కలిగి ఉంది. వినియోగ వస్తువులు, రియల్ ఎస్టేట్, పరికరాలు, వ్యవసాయం లాంటి అనేక ఇతర వ్యాపారాలలో ప్రపంచవ్యాప్తంగా 1.1 బిలియన్ వినియోగదారులకు సేవలు అందిస్తోంది. గోద్రెజ్ గ్రూప్ ప్రస్తుతం 90కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
Also Read: Ration Card: రేషన్ కార్డులో కొత్త సభ్యుల పేర్లను ఇలా చేర్చండి.. పూర్తి వివరాలు ఇదిగో..!