ధనం మూలం ఇదం జగత్.. అంటే ప్రపంచంలో డబ్బు ఉంటేనే మనిషికి విలువ ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ పొదుపు మంత్రాన్ని పాటిస్తూ ఉంటారు. అంటే నెలనెలా వారికి వచ్చిన సొమ్మును కొంత మేర పొదుపు చేస్తూ ఉంటారు. అయితే అనుకోకుండా ఓ మరింత ఎక్కువ సొమ్ము చేతికి వచ్చినప్పుడు ఆ సొమ్మును వృథా చేయకుండా పొదుపు చేయడానికి వివిధ పథకాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా అనేక రకాల పథకాలు పోస్ట్ ఆఫీస్ ద్వారా అమలు చేస్తారు. వీటిలో ఒకటి నెలవారీ ఆదాయ పథకం (ఎంఐఎస్). ఇది డిపాజిట్ స్కీమ్. దీనిలో మీరు ఒకసారి పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రతి నెలా సంపాదించవచ్చు. పీఓఎంఐఎస్‌లో ఒకే ఖాతాలో గరిష్టంగా రూ. 9 లక్షలు, ఉమ్మడి ఖాతాలో గరిష్టంగా రూ. 15 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. మీరు ఎంత మొత్తాన్ని డిపాజిట్ చేసినా మీకు ప్రతి నెలా వడ్డీ ఇస్తారు. ప్రస్తుతం పోస్టాఫీసు ఎంఐఎస్‌లో వడ్డీ రేటు 7.4 శాతంగా ఉంది. ఈ పథకం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
పోస్ట్ ఆఫీస్ ఎంఐఎస్‌లో మొత్తం ఒకేసారి 5 సంవత్సరాల పాటు డిపాజిట్ చేస్తారు. అంటే మీరు వరుసగా 5 సంవత్సరాలు వడ్డీ తీసుకోవడం ద్వారా మీ ఆదాయాన్ని పొందవచ్చు. మెచ్యూరిటీ తర్వాత డిపాజిట్ చేసిన మొత్తం మీకు తిరిగి వస్తుంది. అయితే మీకు ఐదేళ్లలోపు డబ్బు అవసరమైతే మరియు దానిని ఉపసంహరించుకోవాలనుకుంటే లేదా నెలవారీ సంపాదన పథకాన్ని ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం కొనసాగించాలనుకుంటే నియమాలను చూద్దాం.
సాధారణంగా మీరు ఎఫ్‌డీ, పీపీఎఫ్ మొదలైన అన్ని పథకాలలో మీ ఖాతాను పొడిగించే సదుపాయాన్ని పొందుతారు. కానీ మీరు పోస్ట్ ఆఫీస్ మంత్లీ సేవింగ్ స్కీమ్‌లో ఈ సదుపాయాన్ని పొందలేరు. మీరు పథకానికి సంబంధించిన ప్రయోజనాలను మరింత పొందాలనుకుంటే మీరు మెచ్యూరిటీ తర్వాత కొత్త ఖాతాను తెరవవచ్చు.
పోస్టాఫీస్ మంత్లీ సేవింగ్స్ స్కీమ్‌లో ఒకే ఖాతాలో రూ.9 లక్షలు డిపాజిట్ చేస్తే, 7.4 శాతం వడ్డీతో ప్రతి నెలా రూ.5,500 నెలవారీ ఆదాయం పొందవచ్చు. కాగా జాయింట్ అకౌంట్‌లో రూ.15 లక్షలు డిపాజిట్ చేస్తే ప్రతి నెలా రూ.9,250 ఆదాయం పొందవచ్చు.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం