Money9: సీఎన్‌జీ, పీఎన్‌జీ వాహనదారులకు షాక్‌.. మరోసారి పెరిగిన ధరలు

|

Aug 04, 2022 | 10:29 PM

Money9: కంప్రెస్‌డ్‌ నాచురల్‌ గ్యాస్‌ (సీఎన్‌జీ), పైప్‌డ్‌ నాచురల్‌ గ్యాస్‌ (పీఎన్‌జీ) ధరలు మళ్లీ పెరిగాయి. ఈ ధరలు బుధవారం నుంచే అమల్లోకి వచ్చాయి. 18 శాతం..

Money9: సీఎన్‌జీ, పీఎన్‌జీ వాహనదారులకు షాక్‌.. మరోసారి పెరిగిన ధరలు
Follow us on

Money9: కంప్రెస్‌డ్‌ నాచురల్‌ గ్యాస్‌ (సీఎన్‌జీ), పైప్‌డ్‌ నాచురల్‌ గ్యాస్‌ (పీఎన్‌జీ) ధరలు మళ్లీ పెరిగాయి. ఈ ధరలు బుధవారం నుంచే అమల్లోకి వచ్చాయి. 18 శాతం ధరలు పెరగడంతో సీఎన్‌జీ వాహనదారులకు మరింత భారం మారింది. LNG ధర యూనిట్‌కు $10.5 కి పెరిగింది . మరోవైపు ఐరోపా దేశాల నుంచి సహజవాయువుకు విపరీతమైన డిమాండ్ ఉండడంతో గ్యాస్ దిగుమతులు పెరిగాయి. ఇప్పటి వరకు గ్యాస్ దిగుమతుల కోసం ఇండియన్ ఆయిల్ టెండర్ కోసం ఎటువంటి బిడ్ వేయలేదు. దేశంలో వినియోగించే మొత్తం సహజ వాయువులో 50 శాతం దిగుమతి అవుతున్నందున ఇది దేశంలో సహజ వాయువు ధరలపై కూడా ప్రభావం చూపుతుంది.

పెరిగిన ధరల కారణంగా పొరుగు దేశాలు కూడా సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. పెరిగిన ధరల కారణంగా బంగ్లాదేశ్‌లో విద్యుత్ ఉత్పత్తి దెబ్బతింది. దీంతో కరెంటు కోతలను ఎదుర్కొంటోంది. అదే సమయంలో పాకిస్తాన్ తన సహజ వాయువు సరఫరాను నియంత్రణలో ఉంచుకోవడానికి తన ప్రజలపై సుమారు $12 బిలియన్ల పన్ను విధించాలని నిర్ణయించింది. అయితే అంతర్జాతీయంగా గ్యాస్‌ రేట్లు పెరిగిన నేపథ్యంలో భారత్‌లో కూడా గత కొన్ని రోజులుగా వివిధ కంపెనీల అవసరాలకు గ్యాస్‌ సరఫరాను సైతం తగ్గించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి