Upi Lite
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) సెప్టెంబర్ 2022లో యూపీఐ లైట్ అనే కొత్త చెల్లింపు వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఇది ఒరిజినల్ యూపీఐ చెల్లింపు వ్యవస్థకు సంబంధించి సరళీకృత సంస్కరణగా పేర్కొంది. ఈ సరికొత్త చెల్లింపు వ్యవస్థ ప్రతిరోజూ చిన్న విలువ లావాదేవీలను ప్రారంభించేందుకు వినియోగదారులను అనుమతిస్తుంది. బ్యాంక్ ప్రాసెసింగ్, మరిన్ని సమస్యల విషయంలో వైఫల్య సమస్యలు తీర్చడానికి ఈ చెల్లింపు వ్యవస్థను ప్రవేశపెట్టారు. యూపీఐ లైట్ తక్కువ విలువ లావాదేవీల కోసం రూపొందించారు. సాధారణ యూపీఐ లావాదేవీల రోజువారీ పరిమితి రూ. 1 లక్షగా ఉంటే యూపీఐ లైట్ లావాదేవీలు ఒక్కో లావాదేవీకి రూ. 200 మాత్రమే ఉంటుందని గమనించాలి.
యూపీఐ లైట్‌ని ఉపయోగించడానికి వినియోగదారులు ముందుగా వారి లింక్ చేసిన బ్యాంక్ ఖాతా ద్వారా వారి యూపీఐ లైట్ ఖాతాకు డబ్బును జోడించాలి. ఖాతాను సెటప్ చేసిన తర్వాత వినియోగదారులు తమ యూపీఐ లైట్ ఖాతాకు రోజుకు రెండుసార్లు రూ. 2,000 వరకు జోడించవచ్చు. అయితే ఇలా రోజువారీ మొత్తం రోజువారీ పరిమితి రూ.4,000గా ఉంది. తరచుగా చెల్లింపులు చేయాలనుకునే వ్యక్తులకు యూపీఐ లైట్ మంచి ఎంపిక. లైట్ వినియోగదారులు తమ ఖాతాను ఎప్పుడైనా మూసివేయవచ్చు లేదా వారి లైట్ ఖాతా నుంచి వారి బ్యాంక్ ఖాతాకు ఒకే క్లిక్‌తో మరియు ఎటువంటి రుసుము లేకుండా నిధులను బదిలీ చేయవచ్చు. కాబట్టి గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యాప్స్ యూపీఐ లైట్‌ను ఎలాం సెటప్ చేయాలో? ఓ సారి తెలుసుకుందాం.
జీపే లో యూపీఐ లైట్ యాక్టివేషన్ ఇలా
- గూగుల్ పేయాప్‌ను తెరిచి ఎగువ కుడి మూలలో ఉన్న మీ ప్రొఫైల్ చిత్రంపై నొక్కాలి.
- పే పిన్ ఉచిత యూపీఐ లైట్‌పై ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.
- మీ యూపీఐ లైట్ బ్యాలెన్స్‌కు డబ్బును జోడించడానికి ఆన్-స్క్రీన్ సూచనలను అనుసరించారు. రూ.2,000 నిధులను యాడ్ చేసే అవకాశం ఉంటుంది.
- డబ్బును జోడించడానికి యూపీఐ లైట్‌కి మద్దతిచ్చే అర్హత ఉన్న బ్యాంక్ ఖాతాను ఎంచుకుని, డబ్బు జోడించాలి.
- డబ్బును జోడించిన తర్వాత మీరు మీ యూపీఐ పిన్‌ను నమోదు చేయకుండానే రూ. 200 వరకు చెల్లింపులు యూపీఐ లైట్ ద్వారా చేయవచ్చు.
- చెల్లింపు సమయంలో మీరు మీ యూపీఐ పిన్‌ని నమోదు చేయమని అడిగనప్పడు యూపీఐ లైట్ ఎంపికను ఎంచుకోవాలి.
ఫోన్‌పేలో యాక్టివేషన్ ఇలా
- ఫోన్‌పే యాప్‌ని తెరిచి, ఫోన్‌పే యాప్ హోమ్ స్క్రీన్‌పై యూపీఐ లైట్‌ని నొక్కాలి. మీరు మీ ప్రొఫైల్ చిత్రాన్ని నొక్కి చెల్లింపు పద్ధతుల విభాగంలో యూపీఐ లైట్‌ని ఎంచుకోవాలి.
- అక్కడ యూపీఐ లైట్ బ్యాలెన్స్‌కు డబ్బును జోడించడానికి ఆన్-స్క్రీన్ సూచనలను అనుసరించాలి. మీరు రూ. 2,000 వరకు జోడించవచ్చు.
- మీరు మీ యూపీఐ లైట్ బ్యాలెన్స్‌కు డబ్బును జోడించిన తర్వాత మీరు మీ యూపీఐ పిన్‌ను నమోదు చేయకుండానే రూ.200 వరకు చెల్లింపులు చేయవచ్చు.
పేటీఎంలో యాక్టివేషన్ ఇలా
- పేటీఎం యాప్‌ను తెరిచి హోం పేజీలో ఇంట్రడ్యూసింగ్ యూపీఐ లైట్‌పైక్లిక్ చేయాలి.
- అనంతరం యూపీఐ లైట్ ద్వారా సపోర్ట్ చేసే లింక్ చేసిన బ్యాంక్ ఖాతాను ఎంచుకుని డబ్బుని జోడించాలి.
- డబ్బు జోడించిన తర్వాత మీరు క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా లేదా యూపీఐ ఐడీతో లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు గ్రహీతకు చెల్లించవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..