Money Rules: వినియోగదారులకు అలర్ట్‌.. మే 1 నుంచి మారనున్న రూల్స్‌..మీ జేబుపై ప్రభావం

|

Apr 28, 2024 | 12:06 PM

ఏప్రిల్ నెల ముగియబోతోంది. అటువంటి పరిస్థితిలో, కొత్త నెల ప్రారంభంతో బ్యాంకులకు సంబంధించిన అనేక నియమాలు మారుతాయి. ఇది సామాన్య ప్రజల జేబులపై నేరుగా ప్రభావం చూపుతుంది. ప్రతి నెల మారే నిబంధనలలు ఆర్థిక విషయాలకు సంబంధించినవి ఉంటాయి. ముందస్తుగా అలర్ట్ అయితే ఇబ్బందులు పడకుండా ఉండవచ్చు. లేకుంటే పలు ఇబ్బందులతో పాటు ఆర్థికంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఉంటుందని వినియోగదారులు గుర్తించుకోవాలి.

Money Rules: వినియోగదారులకు అలర్ట్‌.. మే 1 నుంచి మారనున్న రూల్స్‌..మీ జేబుపై ప్రభావం
May 1st
Follow us on

ఏప్రిల్ నెల ముగియబోతోంది. అటువంటి పరిస్థితిలో, కొత్త నెల ప్రారంభంతో బ్యాంకులకు సంబంధించిన అనేక నియమాలు మారుతాయి. ఇది సామాన్య ప్రజల జేబులపై నేరుగా ప్రభావం చూపుతుంది. ప్రతి నెల మారే నిబంధనలలు ఆర్థిక విషయాలకు సంబంధించినవి ఉంటాయి. ముందస్తుగా అలర్ట్ అయితే ఇబ్బందులు పడకుండా ఉండవచ్చు. లేకుంటే పలు ఇబ్బందులతో పాటు ఆర్థికంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఉంటుందని వినియోగదారులు గుర్తించుకోవాలి.

  1. HDFC బ్యాంక్ తన స్పెషల్ సీనియర్ కేర్ FD కోసం గడువును మే 10 వరకు పొడిగించింది. 5 నుండి 10 సంవత్సరాల ఈ ఎఫ్‌డీలో పెట్టుబడి పెట్టడం ద్వారా, సీనియర్ సిటిజన్లు అదనపు 0.75 శాతం వడ్డీ రేటు ప్రయోజనాన్ని పొందుతున్నారు.
  2. ICICI బ్యాంక్ తన సేవింగ్స్ ఖాతాకు సంబంధించిన అనేక రకాల ఛార్జీలను మార్చింది. ఇందులో డెబిట్ కార్డ్ నుండి చెక్ బుక్, IMPS మొదలైన అనేక ఛార్జీలు ఉంటాయి. కొత్త ఛార్జీలు మే 1, 2024 నుండి వర్తిస్తాయి.
  3. యెస్ బ్యాంక్ తన సేవింగ్స్ ఖాతా ఛార్జీలను కూడా సవరించింది. బ్యాంక్ కొత్త ఛార్జీలు మే 1, 2024 నుండి అమలులోకి వస్తాయి.
  4. యస్ బ్యాంక్ తన ప్రైవేట్ క్రెడిట్ కార్డ్ నిబంధనలను మార్చింది. ఇప్పుడు మీరు బ్యాంక్ ప్రైవేట్ క్రెడిట్ కార్డ్ ద్వారా రూ. 15,000 యుటిలిటీ బిల్లు చెల్లింపుపై 1 శాతం జీఎస్టీ చెల్లించాలి. కొత్త నిబంధనలు మే 1, 2024 నుండి అమలులోకి వస్తాయి.
  5. హెచ్‌డీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ తన క్రెడిట్ కార్డుకు సంబంధించిన నిబంధనలను కూడా మార్చింది. ఇప్పుడు ఖాతాదారులు బ్యాంకు క్రెడిట్ కార్డ్ ద్వారా రూ. 20,000 కంటే ఎక్కువ యుటిలిటీ బిల్లుల చెల్లింపుపై ఒక శాతం అదనపు జీఎస్టీని చెల్లించాల్సి ఉంటుంది. ఈ సర్‌ఛార్జ్ 18 శాతం జీఎస్టీకి అదనం. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను మే 1న కూడా మార్చవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి