Mobile Recharge Plans: మొబైల్‌ రీఛార్జ్ ప్లాన్‌లకు నెల రోజులకు బదులుగా 28 రోజులే ఎందుకు? అసలు కారణం ఇదే!

Mobile Recharge Plans: 28 రోజులకు బదులు 30 రోజుల ప్లాన్ ఇవ్వాలని గతంలో టెలికాం కంపెనీలకు ట్రాయ్ (TRAI) మార్గదర్శకాలను జారీ చేసింది. అయినప్పటికీ అన్ని కంపెనీల ప్రణాళికలు మునుపటిలా కొనసాగుతున్నాయి. ట్రాయ్‌ ఆదేశాల మేరకు టెలికాం కంపెనీలు ఎక్కువ..

Mobile Recharge Plans: మొబైల్‌ రీఛార్జ్ ప్లాన్‌లకు నెల రోజులకు బదులుగా 28 రోజులే ఎందుకు? అసలు కారణం ఇదే!

Updated on: Apr 20, 2025 | 3:32 PM

ఈ రోజుల్లో నెలనెలా మొబైల్‌ రీఛార్జ్‌ చేసుకోవడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. ప్రతి నెల రీఛార్జ్‌ చేసుకోవాల్సిందే. లేకుంటే కాల్స్‌ నిలిచిపోతాయి. ఈ రోజుల్లో మొబైల్‌ లేనిది ఏ పనులు జరగని పరిస్థితి. ఒక రోజు అన్నం తినకుండా ఉంటారేమో గానీ మొబైల్‌ లేకుండా ఉండని పరిస్థితి నెలకొంది. ఎవరికైనా కాల్‌ చేయాలన్నా రీఛార్జ్‌ చేసుకోవడం చాలా ముఖ్యం. అయితే ఇందులో జియో, ఎయిర్‌టెల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌, వోడాఫోన్‌ ఐడియా కంపెనీలు ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్‌లో అనేక రకాల ప్లాన్‌లను అందిస్తాయి. అయితే ఈ కంపెనీలన్నీ అందించే ప్లాన్‌ల గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? వాటి వాలిడిటీ కేవలం 28 రోజులు మాత్రమే ఉంటుంది. నెలలో 30, 31 రోజులు ఉంటాయి. కానీ, వారి లెక్క మాత్రం 28 రోజులు మాత్రమే. 28 రోజుల రీఛార్జ్ ఇవ్వడం వల్ల కంపెనీల ప్రయోజనం ఏంటి..? మరి ఇలా 28 రోజులే ఎందుకు ఉంటాయోనని ఎప్పుడైనా ఆలోచించారా? దాని వెనుక అసలు కారణం ఉంది. అదేంటో తెలుసుకుందాం.

ఇంటర్నెట్ ప్లాన్‌లు 28, 56 లేదా 84 రోజులు మాత్రమే ఎందుకు?

భారతదేశంలోని కంపెనీలు 28 రోజుల ఇంటర్నెట్ ప్లాన్‌ను అందిస్తాయి. ఇంతకుముందు, 28 రోజుల ప్లాన్‌లను కొన్ని కంపెనీలు మాత్రమే ఇచ్చేవి. కానీ ఇప్పుడు అన్ని కంపెనీల ప్లాన్‌ల చెల్లుబాటు ఒకే విధంగా ఉంది. ఈ రకమైన ప్లాన్ కారణంగా.. వినియోగదారులు సంవత్సరానికి 12 రీఛార్జ్‌లకు బదులుగా 13 రీఛార్జ్‌లు చేయాల్సి ఉంటుంది. అదే కంపెనీ ప్లాన్‌. అదే నెల రోజుల వ్యాలిడిటీ ఇస్తే సంవత్సరానికి 12 సార్లు మాత్రమే రీఛార్జ్‌ చేసుకుంటారు. అదే 28 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్స్‌ ఇస్తే సంవత్సరానికి 13 సార్లు రీఛార్జ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిబట్టి కంపెనీలకు ఏడాదికి ఒక నెల ఎక్కువగా రీఛార్జ్‌ డబ్బులు అందుకుంటున్నయన్నట్లు. 30 రోజులు ఉన్న నెలలో 2 రోజులు మిగిలిపోతాయి. నెలలో 31 రోజులు ఉంటే 3 రోజులు మిగిలి పోతాయి.

ఇది కూడా చదవండి: Fridge Tips: ఒక రోజులో ఫ్రిజ్ ఎంత విద్యుత్తును వినియోగిస్తుంది? బిల్లు ఎంత?

ఇవి కూడా చదవండి

ఫిబ్రవరి నెల 28/29 రోజులు మాత్రమే ఆ సంవత్సరం మరి కొన్ని రోజులు అదనంగా మిగులుతాయి. దీని కారణంగా మీరు అదనపు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కంపెనీలు ప్రతి సంవత్సరం గరిష్టంగా ఒక నెల రీఛార్జ్ ప్రయోజనాన్ని అదనంగా మనతో లభపడుతుంటారు. ఈ ఒక్క నెల రీఛార్జ్‌తో కంపెనీలక లక్షలాది రూపాయల లాభం సమకూరుతుంది. అయితే ప్రైవేటు కంపెనీలు బిజినెస్ మంత్రం ఇలా ఉంటే మన ప్రభుత్వ సంస్థ అయితే BSNL మాత్రం 30 రోజుల ప్లాన్ ఇప్పటికీ అందిస్తోంది.

ట్రాయ్‌ ఆదేశాలతో..

28 రోజులకు బదులు 30 రోజుల ప్లాన్ ఇవ్వాలని గతంలో టెలికాం కంపెనీలకు ట్రాయ్ (TRAI) మార్గదర్శకాలను జారీ చేసింది. అయినప్పటికీ అన్ని కంపెనీల ప్రణాళికలు మునుపటిలా కొనసాగుతున్నాయి. ట్రాయ్‌ ఆదేశాల మేరకు టెలికాం కంపెనీలు ఎక్కువ ధరతో 30 రోజుల వ్యాలిడిటీ ప్లాన్స్‌ అందిస్తున్నాయి. ఎలాంటి ఆదేశాలు ఉన్నప్పటికీ కంపెనీలకు లాభపడే విధంగానే ప్లాన్స్‌ ఉంటున్నాయి.

ఇది కూడా చదవండి: Air Conditioner: 1.5 టన్నుల AC గంటకు ఎంత విద్యుత్తును వినియోగిస్తుంది? నెల బిల్లు ఎంత వస్తుంది?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి