
Mobile Recharge: పశ్చిమ ఆసియాలో ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావం ఇప్పుడు సామాన్య ప్రజల జేబులపై పడేలా కనిపిస్తోంది. ఈ ఉద్రిక్తతల కారణంగా ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (Crude Oil) ధరలు పెరిగి, పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగే అవకాశం ఉండగా.. ఇప్పుడు దీని ప్రభావం టెలికాం రంగంపై కూడా పడనుంది. త్వరలోనే మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలు కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరగడం వల్ల టెలికాం కంపెనీల నెట్‌వర్క్ నిర్వహణ ఖర్చులు (ముఖ్యంగా మొబైల్ టవర్ల నిర్వహణకు వాడే డీజిల్ జనరేటర్ల ఖర్చు) భారీగా పెరుగుతాయి. జియో (Jio), భారతీ ఎయిర్‌టెల్ (Airtel), వోడాఫోన్ ఐడియా (Vi) వంటి ప్రముఖ టెలికాం కంపెనీలు తమ ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం వల్ల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. తమ లాభాల శాతాన్ని కాపాడుకోవడానికి ప్లాన్ల ధరలను పెంచడం మినహా కంపెనీలకు మరో మార్గం కనిపించడం లేదు.
ఇది కూడా చదవండి: Gold Price: గుడ్‌న్యూస్.. భారీ పతనం.. తులంపై రూ.5 వేలు తగ్గిన బంగారం ధర..!
టెలికాం కంపెనీలు తమ ‘యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్’ (ఒక్కో వినియోగదారుడి నుండి వచ్చే సగటు ఆదాయం) ను పెంచుకోవాలని చాలా కాలంగా భావిస్తున్నాయి. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు దీనికి మరింత కారణమయ్యాయి.
యుద్ధం గనుక ఇలాగే కొనసాగితే, రాబోయే రోజుల్లో టెలికాం కంపెనీలు తమ ప్రీపెయిడ్ మరియు పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల ధరలను 10% నుండి 15% వరకు పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనివల్ల సామాన్యుల నెలవారీ బడ్జెట్‌పై అదనపు భారం పడనుంది.
ఇది కూడా చదవండి: Tiger Facts: పులి ఎదురైతే ఏం చేయాలి? నిజంగా మనుషులను తింటాయా? ఫారెస్ట్ ఆఫీసర్ మాటల్లో షాకింగ్ నిజాలు
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి