
బంగారం, వెండిలో పెట్టుబడి పెట్టేవారికి పెద్ద ఉపశమనం లభించింది. మల్టీ కమోడిటీ ఎక్చేంజ్(MCX), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లు బులియన్ ఫ్యూచర్స్‌పై పెట్టుబడిదారులకు విధిస్తున్న అదనపు మార్జిన్‌ను తొలగించాయి. ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. దీంతో ఇక నుంచి బంగారంపై 3 శాతం, వెండిపై 7 శాతం అదనంగా డిపాజిట్ చేయాల్సిన అవసరం ఉండదు. పసిడి ధరలపై ఇటీవల అస్థిరత తగ్గిన క్రమంలో ఈ మేరకు ఎంసీఎక్స్, ఎన్‌ఎస్‌ఈ నిర్ణయం తీసుకున్నాయి. దీని వల్ల పసిడిలో పెట్టుబడి పెట్టేవారికి ప్రయోజనం కలగనుంది. ఇక నుంచి పెట్టుబడిదారులు గోల్డ్, సిల్వర్‌లో చౌకగా, సులభతరంగా ట్రేడింగ్ చేయవచ్చు. దీని వల్ల అదనపు ఛార్జీలు తగ్గనుండటంతో ట్రేడింగ్ వైపు ఎక్కుమమంది మొగ్గు చూపే అవకాశం ఉంటుంది.
బంగారం, వెండి కొనుగోలు చేయడానికి గతంలో తరహాలోనే గణనీయమైన మార్జిన్లను డిపాజిట్ చేయాల్సిన అవసరం ఉండదు. దీని వల్ల పెట్టుబడిదారులు తక్కువ మూలధనంతో ఇన్వెస్ట్ చేసే అవకాశం లభిస్తుంది. ఈ మేరకు అన్ని బ్యాంకులు ప్యూచర్స్‌పై 3 శాతం అదనపు మార్జిన్, వెండి కాంట్రాక్టులపై విధించే 7 శాతం మార్జిన్ తొలగిస్తున్నట్లు ఎంపీఎక్స్ వెల్లడించింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ కూడా ఇదే తరహాలో ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయంతో చిన్న, రిటైట్ పెట్టుబడిదారులు లాభపడనున్నారు. మార్జిన్ ఎక్కువగా ఉన్నప్పుడు ట్రేడింగ్ ఖర్చులు పెరుగుతాయి. మార్జిన్ల తొలగించడం వల్ల ఇన్వెస్టర్లు అదే సొమ్ముతో ఎక్కువ లాట్లను కొనుగోలు చేయడం, లేదా విక్రయించడం చేయవచ్చు.
ఫిబ్రవరి ప్రారంభంలో బంగారం, వెండి ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. ధరల్లో భారీగా హెచ్చుతగ్గులు చోటుచేసుకోవడం వల్ల మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ క్లియరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (MCXCCL) కఠినమైన రిస్క్ నిర్వహణ చర్యలను ప్రారంభించింది. ఫిబ్రవరి 5న వెండిపై 4.5 శాతం, బంగారంపై 1 శాతం మార్జిన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఫిబ్రవరి 6న వెండిపై 2.5 శాతం, బంగారంపై 2 శాతం మార్జిన్ విధించారు. అయితే ఇప్పుడు మార్కెట్లు అస్థిరత తొలగిపోవడం, ఫ్లాట్‌గా కొనసాగుతుండటంతో మార్జిన్లను తొలగిస్తూ ఏజెన్సీలు నిర్ణయం తీసుకున్నాయి.