Telugu News Business Massive Fire Breaks Out at 10 Locations in Hyderabad; Firefighters Battle Blazes
Hyderabad: హైదరాబాద్‌లో 10 చోట్ల భారీ అగ్ని ప్రమాదం.. మంటలను ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది
Hyderabad Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మైలార్‌దేవ్‌పల్లి పారిశ్రామికవాడలోని ఒక గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో పాటు నగరంలో మొత్తం 10 ప్రాంతాల్లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం సంభవించినట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది ఇంకా మంటలను ఆర్పుతున్నారు.
Hyderabad Fire Accident: దీపావళి వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంలోని సుమారు 10 ప్రధాన ప్రాంతాల్లో భారీ అగ్నిప్రమాదాలు సంభవించాయి. బాణసంచా నిప్పురవ్వలు, రాకెట్లు గోదాములు, దుకాణాల్లో పడటం వల్ల ఈ ప్రమాదాలు చోటుచేసుకున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే కొన్ని ప్రాంతాల్లో అర్థరాత్రి కూడా మంటలు భారీగా ఎగిసి పడ్డాయి.
మైలార్‌దేవ్‌పల్లి (కాటేదాన్ పారిశ్రామికవాడ): ప్లాస్టిక్ గోదాంలో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న ప్లైవుడ్ పరిశ్రమకు వ్యాపించడంతో ఆరు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు.
సీతాఫల్‌మండి (సికింద్రాబాద్): దీపావళికి కాల్చిన ఒక రాకెట్ ప్రమాదవశాత్తు బాణసంచా దుకాణంలోకి దూసుకెళ్లడంతో మంటలు చెలరేగి టపాసులు భారీగా పేలాయి.
బండిమెట్ (సికింద్రాబాద్): బాలాజీ మెడికల్ షాప్‌లో అగ్నిప్రమాదం జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
ఓల్డ్ బోయినపల్లి: విమానాశ్రయానికి సమీపంలోని ఒక మెడికల్ వేర్‌హౌస్ మూడవ అంతస్తులో మంటలు చెలరేగాయి.
ఉడాంగడ్డ (మైలార్‌దేవ్‌పల్లి పరిధి): బాణసంచా నిప్పురవ్వలు పడటంతో ఒక ఈవెంట్ మెటీరియల్స్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.
కుత్బుల్లాపూర్ (పేట్ బషీరాబాద్): బాణసంచా పేలుళ్ల వల్ల తుక్కు (స్క్రాప్) గోదాంలో మంటలు చెలరేగి దట్టమైన పొగ కమ్ముకుంది.
బోడుప్పల్ (గౌతమ్‌నగర్): మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక అట్టల గోదాంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి.
టప్పాచబుత్ర: ఒక ఫర్నిచర్ గోదాంలో మొదలైన మంటలు పక్కనే ఉన్న మరో నాలుగు గోదాములకు, ఒక మినీ ట్రక్కుకు వ్యాపించాయి.
సీతారాం నగర్: ఒక టపాసుల దుకాణంలో మంటలు అంటుకుని అందులోని సామగ్రి మొత్తం దగ్ధమైంది.
చెత్త కుప్పలు, ఇతర ప్రాంతాలు: నగరంలోని పలు ప్రాంతాల్లో బాణసంచా వ్యర్థాల వల్ల చెత్త కుప్పల్లో చిన్నపాటి అగ్నిప్రమాదాలు నమోదయ్యాయి