Maruti Swift: నెలకు పదివేలు కడితే చాలు.. కొత్త మారుతీ కారు మీ సొంతం చేసుకోవచ్చు.. ఎలాగంటే..

|

Apr 14, 2021 | 5:49 PM

ఇండియాలో కార్ల అమ్మకాల్లో టాప్ ప్లేసులో నిలిచే బ్రాండ్ మారుతి స్విఫ్ట్! మారుతీ సుజుకీ ఈ స్విఫ్ట్ మోడల్ ను పదిహేనేళ్ల క్రితం లాంచ్ చేసింది.

Maruti Swift: నెలకు పదివేలు కడితే చాలు.. కొత్త మారుతీ కారు మీ సొంతం చేసుకోవచ్చు.. ఎలాగంటే..
Maruti Swift Facelift
Follow us on

Maruti Swift: ఇండియాలో కార్ల అమ్మకాల్లో టాప్ ప్లేసులో నిలిచే బ్రాండ్ మారుతి స్విఫ్ట్! మారుతీ సుజుకీ ఈ స్విఫ్ట్ మోడల్ ను పదిహేనేళ్ల క్రితం లాంచ్ చేసింది. ఈ మోడల్ మార్కెట్ లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా దాని క్రేజ్ తగ్గలేదు. ఇప్పటికీ టాప్ సేల్స్ ను ఈ మోడల్ కొల్లగొడుతోంది. స్విఫ్ట్ కారును ఎప్పటికప్పుడు సరికొత్తగా ఉంచే ప్రయత్నం చేస్తూ వస్తోంది మారుతి. అందులో భాగంగా మారుతి సుజుకి ఇండియా 2021 స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్‌ ను ఫిబ్రవరి నెలలో విడుదల చేసింది. స్విఫ్ట్ కి కొన్ని అప్ డేషన్స్ తో ఈ మోడల్ విడుదల చేసింది మారుతి. ఇది కూడా ఆకట్టుకునే విధంగా ఉంది.
2021 మారుతి సుజుకి స్విఫ్ట్ సరికొత్త నెక్స్ట్-జెన్ కె-సిరీస్ డ్యూయల్-జెట్, డ్యూయల్-వివిటి పెట్రోల్ ఇంజిన్‌తో వస్తోంది.

ఈ కారు ప్రత్యేకతలు చూస్తే..

  • 2021 మారుతి సుజుకి స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్ మధ్యలో బోల్డ్ హారిజాంటల్ క్రోమ్ తో సరికొత్త మెష్ గ్రిల్‌ను కలిగి ఉంది.
    ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, ఎల్‌ఈడీ టెయిల్ లాంప్స్ దీనికి అమర్చారు.
  • 15-అంగుళాల ప్రెసిషన్-కట్ అల్లాయ్ వీల్స్ ఇచ్చారు.
  • ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు అవుట్‌గోయింగ్ మోడల్ కంటే బాగా వున్నాయి.
  • 1.2 లీటర్ కె-సిరీస్ పెట్రోల్, 1.3 లీటర్ డీడీఐఎస్ డీజిల్ ఇంజిన్లను కొత్త స్విఫ్ట్‌లోనూ వాడారు.
  • మారుతి సుజుకి ఇండియా 2021 స్విఫ్ట్ ఎంటి 23.20 కిలోమీటర్లు, 2021 స్విఫ్ట్ ఎఎమ్‌టి 23.76 కిలోమీటర్లు మైలేజీ ఇస్తుందని పేర్కొంది.

ఈ కారు ధర చూస్తే..

దీని ప్రారంభ ధర రూ.5.73 లక్షలకు(ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) విడుదల చేసింది. టాప్-ఆఫ్-లైన్ వేరియంట్ రూ.8.41 లక్షలకు(ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) లభిస్తుంది. అయితే ఈ కారును ఫైనాన్స్ లో ఈఎంఐ రూపంలోనూ తీసుకునే వెసులుబాటు ఉంది. ఈ కారు ఫైనాన్స్ విషయానికి వస్తే కనిస్టంగా రూ.1,28,759 డౌన్ పేమెంట్ చెల్లించి కారును సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా మార్కెట్లో బ్యాంకులు అత్యల్పంగా 7 నుంచి 9 శాతం మధ్యలో కార్ల వడ్డీ రేట్లతో లోన్లను అందిస్తున్నారు. ఈ లెక్కన 5 సంవత్సరాల కాల వ్యవధికి సుమారు రూ.10 వేల వరకూ ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.

Also Read: సరికొత్త రికార్డుకు చేరువలో TCS…అత్యధిక ఉద్యోగులు పనిచేస్తున్న ఐటీ కంపెనీలు ఇవే..!

Corona in Tollywood: టాలీవుడ్‌లో కరోనా టెన్షన్.. పలువురు సెలబ్రిటీలకు పాజిటివ్.. తాజా రిపోర్ట్ ఇది