
Maruti Suzuki e-Vitara: మారుతి సుజుకి భారతదేశంలో తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ఇ-విటారా ప్రారంభ ధరలను ఎట్టకేలకు ప్రకటించింది. మారుతి ఇ-విటారా ధరలు రూ.10.99 లక్షల నుండి ప్రారంభమవుతాయి. అలాగే మూడు వేరియంట్లలో లభిస్తాయని కంపెనీ తెలిపింది. బేస్ డెల్టా, మిడ్-సైజ్ జీటా, టాప్-ఎండ్ ఆల్ఫా. ఈ కారును బుక్ చేసుకోవడానికి మీరు రూ.21,000 చెల్లించాలి.
కారు రూ.10.99 లక్షల ధర BAAS పథకంలో భాగమని తెలుసుకోవడం ముఖ్యం. ఇందులో కిలోమీటరుకు రూ.3.99 చొప్పున బ్యాటరీ సామర్థ్యం ఖర్చు అవుతుంది. ఈ ధర డెల్టా వేరియంట్ కోసం ఇది 49kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇతర వేరియంట్‌ల ధరలు ఇంకా ప్రకటించలేదు. మొదటి సంవత్సరం ఛార్జింగ్ ఉచితం, ధరలో హోమ్ ఛార్జర్ చేర్చలేదు.
మారుతి ఇ-విటారా రెండు బ్యాటరీ ఆప్షన్‌లతో వస్తుంది. బేస్ వేరియంట్ 49kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. మిగిలిన రెండు వేరియంట్‌లలో 61kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఈ కారు మొత్తం 11 కలర్స్‌లో లభిస్తుంది. వీటిలో ఒపులెంట్ రెడ్, బ్లూయిష్ బ్లాక్, ఆర్కిటిక్ వైట్, గ్రాండియర్ గ్రే, స్ప్లెండిడ్ సిల్వర్, నెక్సా బ్లూ ఉన్నాయి. కొత్త డ్యూయల్-టోన్ రంగులలో ల్యాండ్ బ్రీజ్ గ్రీన్, స్ప్లెండిడ్ సిల్వర్, ఒపులెంట్ రెడ్ మరియు ఆర్కిటిక్ వైట్ ఉన్నాయి.
పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో కంపెనీ 543 కిలోమీటర్ల రేంజ్‌ను క్లెయిమ్ చేస్తుంది. ఈ కారు భారత్ NCAP నుండి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కూడా పొందింది. ఛార్జింగ్ నెట్‌వర్క్ కూడా కారు ప్రధాన లక్షణం. ఇక్కడ 1100 కంటే ఎక్కువ నగరాల్లో 2000 కంటే ఎక్కువ ఛార్జింగ్ పాయింట్లు అందుబాటులో ఉన్నాయి. e for Me యాప్ ద్వారా ప్రతి 10 కిలోమీటర్లకు ఛార్జర్ ఉంటుందని కంపెనీ పేర్కొంది. అదనంగా, 1500 EV వర్క్‌షాప్‌లు కూడా సిద్ధం చేసింది. కారు ఫీచర్ల విషయానికొస్తే.. దీనికి ADAS లెవల్ 2, 7 ఎయిర్‌బ్యాగ్‌లు, సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, పవర్డ్ డ్రైవర్ సీటు వంటి అనేక ఆధునిక ఫీచర్లు అందించింది. eVitaraతో బైబ్యాక్ స్కీమ్ కూడా అందిస్తోంది.
మారుతి e-Vitara దాదాపు 10-80 శాతం ఛార్జ్ చేయగలదని, 49 kWh మరియు 61 kWh బ్యాటరీ ప్యాక్‌లకు వరుసగా 6.5 గంటలు మరియు 9 గంటల్లో 7.4 kWh ఛార్జర్‌తో ఉంటుందని చెప్పారు. వేగవంతమైన DC ఛార్జర్‌తో, బ్యాటరీ ఛార్జింగ్ కేవలం 45 నిమిషాల్లో 10-80 శాతం ఛార్జ్ చేయగలదని కంపెనీ తెలిపింది. అయితే బ్యాటరీ సామర్థ్యం బట్టి ఛార్జింగ్ సమయంలో తేడా ఉంటుందని కూడా తెలిపింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి