Maruti Suzuki: మారుతి సుజుకికి భారీగా తగ్గిన లాభాలు.. దెబ్బతీసిన సెమీ కండక్టర్ల కొరత..!

|

Jan 26, 2022 | 7:34 AM

Maruti Suzuki:దేశంలో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకికి లాభాలు తగ్గాయి. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో..

Maruti Suzuki: మారుతి సుజుకికి భారీగా తగ్గిన లాభాలు.. దెబ్బతీసిన సెమీ కండక్టర్ల కొరత..!
Follow us on

Maruti Suzuki:దేశంలో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకికి లాభాలు తగ్గాయి. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 47.82 శాతం క్షీణించి రూ.1,041.8 కోట్ల కు పడిపోయినట్లు నివేదికలు తెలిపాయి. ఇక రెండో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ నికరలాభం రూ.1,996.7 కోట్లుంది. మరో వైపు అంతర్జాతీయంగా ఎలక్ట్రానిక్‌ విడిభాగాల కొరత కారణంగా క్యు3లో 90 వేల కార్లు ఉత్పత్తి చేయలేకపోయామని మారుతి సుజుకి వెల్లడించింది.
అమ్మకాలు పడిపోవడంతో పాటు కమోడిటీ ధరల పెరుగుదల లాభాలు తగ్గిపోయాయని తెలిపింది.

అలాగే త్రైమాసికంలో ఆదాయం స్వల్పంగా తగ్గి రూ.23,253.3 కోట్లుంది. మొత్తం వాహనాల విక్రయాలు 13.1 శాతం పడిపోయి 4,30,668 యూనిట్లకు పరిమితం అయ్యాయి. ఇలా సెమికండక్టర్‌ కొరత కారణంగా మారుతి సుజుకికి లాభాలు తగ్గుముఖం పట్టాయి. మరో వైపు పండగ సీజన్‌లో డిమాండ్‌ అధికంగా ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో ప్లాంట్లలో ఉత్పత్తి చేయలేదని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం 2.40 లక్షల ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నట్లు వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

Hyderabad: టెక్నాలజీలో దూసుకుపోతున్న హైదరాబాద్‌.. చిప్‌ల తయారీ దిశగా సెరిమోర్ఫిక్‌ కంపెనీ

Gold Price Today: పసిడి కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం..