Car offers: కొత్త కారు కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. లక్ష వరకు డిస్కౌంట్‌ అందిస్తోన్న మహీంద్రా.

|

Dec 11, 2022 | 11:08 AM

దేశీయంగా కార్ల విక్రయాలలో అగ్రగామిగా ఉన్న మహీంద్రా తన ఫ్లాగ్‌షిప్ SUV కార్ల కొనుగోలుపై డిసెంబర్ ఆఫర్‌ను ప్రకటించింది. కొత్తేడాదికి కొత్త కారుతో వెల్‌కమ్‌ చెప్పాలనుకుంటోన్న వారికి ఇది మంచి ఆప్షన్‌గా చెప్పొచ్చు. మహీంద్ర కంపెనీ ఈ ఆఫర్‌లో భాగంగా..

Car offers: కొత్త కారు కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. లక్ష వరకు డిస్కౌంట్‌ అందిస్తోన్న మహీంద్రా.
Mahindra Offers On Cars
Follow us on

దేశీయంగా కార్ల విక్రయాలలో అగ్రగామిగా ఉన్న మహీంద్రా తన ఫ్లాగ్‌షిప్ SUV కార్ల కొనుగోలుపై డిసెంబర్ ఆఫర్‌ను ప్రకటించింది. కొత్తేడాదికి కొత్త కారుతో వెల్‌కమ్‌ చెప్పాలనుకుంటోన్న వారికి ఇది మంచి ఆప్షన్‌గా చెప్పొచ్చు. మహీంద్ర కంపెనీ ఈ ఆఫర్‌లో భాగంగా క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్, కార్పొరేట్ డిస్కౌంట్‌లను అందిస్తోంది. ఈ డిస్కౌంట్‌ ద్వారా కొత్త కార్లపై రూ. 20 వేల నుంచి రూ. 1 లక్ష వరకు ఆదా చేసుకోవచ్చు కంపెనీ నిర్వాహకులు చెబుతున్నారు. ఏయే కారుపై ఎంత డిస్కౌంట్‌ లభిస్తోంది లాంటి పూర్తి వివరాలు మీకోసం..

ఎక్స్‌యూవీ 300:

ఈ కారుపై మహీంద్ర కంపెనీ రూ. 53 వేల నుంచి రూ. 1 లక్ష వరకు డిస్కౌంట్‌ అందిస్తోంది. XUV300కి చెంది W8(O) వేరియంట్ కొనుగోలుపై అధిక ఆఫర్ అందుబాటులో ఉంది, టర్బో స్పాట్ వెర్షన్ కూడా రూ. 60 వేల తగ్గింపు లభిస్తుంది.

బొలెరో నియో:

బొలెరో నియో ఎస్‌యూవీ కారు కొనుగోలుపై మహీంద్రా కంపెనీ రూ. 68 వేల నుంచి రూ. 95 వేల వరకు డిస్కౌంట్‌ అందిస్తోంది. బొలెరో నియో SUVకి చెందిన N10 వేరియంట్‌లపై అత్యధిక ఆఫర్ అందుబాటులో ఉంది, ఇది ఎంట్రీ-లెవల్ SUV కొనుగోలుదారులకు బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.

ఇవి కూడా చదవండి

బొలెరో ఎస్‌యూవీ:

ఈ కారుపై మహీంద్ర దాదాపు రూ. 33 వేల నుంచి రూ. 95 వేల వరకు డిస్కౌంట్‌ అందిస్తోంది. బొలెరో SUVకి చెందిన B8 (O) వేరియంట్‌పై మరిన్ని ఆఫర్లను అందిస్తోంది. ఎస్‌యూవీ కార్లను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్‌.

థార్‌:

మహీంద్ర నుంచి థార్‌ భారీ అమ్మకాలతో రికార్డ్ సెట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కారు వివిధ వేరియంట్‌ల ఆధారంగా కంపెనీ రూ. 20,000 డిస్కౌంట్‌ అందిస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..