Mahila Samman Savings Scheme: మహిళలకు సరికొత్త సేవింగ్స్ పథకం.. ఎఫ్ డీ కంటే ఇది బెటరా?

ముఖ్యంగా చిన్నపాటి మహిళా పొదుపు ఖాతాదారుల కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకంపై ఆడపిల్ల లేదా మహిళల పేరుపై డిపాజిట్ చేయవచ్చు. మహిళా సేవింగ్స్ సర్టిఫికెట్ రెండేళ్ల కాలానికి అందుబాటులో అంటే 2025 వరకూ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

Mahila Samman Savings Scheme: మహిళలకు సరికొత్త సేవింగ్స్ పథకం.. ఎఫ్ డీ కంటే ఇది బెటరా?
Ladies

Updated on: Feb 09, 2023 | 11:50 AM

భారతదేశంలో మహిళా సాధికారతకు కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలను ప్రవేశపెడుతుంది. ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ (ఎంఎస్ఎస్ సీ) పథకాన్ని ప్రకటించారు. బ్యాంకులు ఇచ్చే ఎఫ్ డీ వడ్డీ రేట్ల కంటే ఎక్కువగా వడ్డీని ఈ పథకం కింద మహిళలకు ఇస్తారు. ముఖ్యంగా చిన్నపాటి మహిళా పొదుపు ఖాతాదారుల కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకంపై ఆడపిల్ల లేదా మహిళల పేరుపై డిపాజిట్ చేయవచ్చు. మహిళా సేవింగ్స్ సర్టిఫికెట్ రెండేళ్ల కాలానికి అందుబాటులో అంటే 2025 వరకూ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ పథకంలో గరిష్టంగా రూ.2 లక్షల వరకూ మాత్రమే డిపాజిట్ చేయాలి. 7.5 శాతం వరకూ వడ్డీ వస్తుంది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకంలో పాక్షిక ఉపసంహరణకు భారత ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. అలాగే ఆదాయపు పన్ను నిబంధనలు 80 సీసీ మేరకు పన్ను రాయితీ ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎఫ్ డీ కంటే ఈ పథకం లాభామో? నష్టమో? ఇప్పుడు చూద్దాం.

ఎఫ్ డీ, ఎంఎస్ఎస్ సీ పథకానికి తేడాలు

దేశంలోని అన్ని బ్యాంకులు సరాసరి ఫిక్స్ డ్ డిపాజిట్లపై ఇంచుమించు 6.75 శాతం వడ్డీని ఇస్తున్నాయి. హెచ్ డీఎఫ్ సీ, ఐసీఐసీఐ, కోటక్ మహీంద్ర వంటి ప్రైవేట్ బ్యాంకులు 7 శాతం వరకూ వడ్డీను అందిస్తున్నాయి. వీటితో పోలిస్తే ఎంఎస్ఎస్ సీ పథకం కింద డిపాజిట్ చేస్తే 0.50-1.00 శాతం వరకూ వడ్డీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆర్ బీఐ నిబంధనల ప్రకారం ఆయా బ్యాంకులకు రూ.5 లక్షల ప్రమాద బీమా ఉందో? లేదో? చూసుకోవాలి. కాబట్టి ఎంఎస్ఎస్ సీ స్కీం కింద పెట్టుబడి పెట్టే బ్యాంకు లేదా ఫైనాన్స్ సంస్థ మీద తగిన విచారణ చేసి పెట్టుబడి పెట్టడం ఉత్తమమని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..