డిసెంబర్ 1 నుంచి మారనున్న గ్యాస్ సిలిండర్ రూల్స్.. 7 ముఖ్యమైన అప్డేట్స్.. కొత్త నిబంధనలు ఇవిగో..

New LPG Gas Rules: గ్యాస్ సిలిండర్ల వినియోగదారులకు బిగ్ అలర్ట్, డిసెంబర్ 1వ తేదీ నుంచి రూల్స్‌లో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. మీ ఇంట్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ఉపయోగిస్తుంటే ఈ నిబంధనల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. గ్యాస్ ధరల నుంచి సిలిండర్ల బుకింగ్ వరకు మార్పుల గురించి తెలుసుసుకుందాం.

డిసెంబర్ 1 నుంచి మారనున్న గ్యాస్ సిలిండర్ రూల్స్.. 7 ముఖ్యమైన అప్డేట్స్.. కొత్త నిబంధనలు ఇవిగో..
Gas Cylinder

Updated on: Nov 27, 2026 | 11:28 AM

ప్రతీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ అనేది తప్పనిసరి. దీంతో ఎల్పీజీ వంటగ్యాస్‌కు సంబంధించి ఏమైనా చిన్న మార్పులు చేటుచేసుకున్నా దేశవ్యాప్తంగా అందరిపై ప్రభావితం చూపిస్తాయి. డిసెంబర్ 1వ తేదీ నుంచి గ్యాస్ రూల్స్‌లో భారీ మార్పులు రానున్నాయి. ఈ కొత్త నిబంధనల గురించి ప్రతీఒక్కరూ తెలుసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే సమస్యలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా 7 ముఖ్యమైన అప్డేట్స్ గురించి గ్యాస్ వినియోగదారులు అవగాహన కలిగి ఉండాలి. వీటిల్లో కొన్ని ఇప్పటికే అమల్లోకి రాగా.. డిసెంబర్ నుంచి మరికొన్ని నిబంధనలు మారనున్నాయి. సబ్సిడీ, బుకింగ్, డెలివరీ, ధరలకు సంబంధించి తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఏంటనేది ఒకసారి చూద్దాం.

పెరగనున్న గ్యాస్ ధరలు..!

డిసెంబర్ 1వ తేదీ నుంచి గ్యాస్ ధరల్లో మార్పులు అమల్లోకి రానున్నాయి. ప్రతీ నెల ఒకటో లేదీన ప్రభుత్వ చమురు సంస్థలు గ్యాస్ ధరలను ప్రకటిస్తూ ఉంటాయి. ఉదయం 6 గంటలకు సవరించిన ధరలను విడుదల చేస్తాయి. గత కొన్ని నెలలుగా హోటళ్లు, రెస్టారెంట్స్, ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు ఉపయోగించే వాణిజ్య సిలిండర్ల ధరలను పెంచుతుండగా.. వచ్చే నెలలో కూడా పెరిగే ఛాన్సుంది. అలాగే పైప్డ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్(PNG) పొందినవారు తమ ఎల్పీజీ సిలిండర్లను వెనక్కి ఇచ్చేయాలి. ఒకే ఇంట్లో రెండు కనెక్షన్లు కలిగి ఉండటానికి వీల్లేదు. పీఎన్జీ కనెక్షన్ పొందిన వెంటనే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను సరెండర్ చేయాలి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే పీఎన్జీ, ఎల్పీజీ రెండూ కనెక్షన్లను ఉపయోగించుకోవచ్చు. దీనికి గ్యాస్ కంపెనీల అనుమతి ఉండాలి.

5,10 కేజీల సిలిండర్లు పొందవచ్చు..

ప్రస్తుతం 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ల కనెక్షన్లను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో గ్యాస్ అవసరమైనవారు 5 లేదా 10 కేజీల సిలిండర్లను పొందవచ్చు. అలాగే మీ ఇంట్లో అధిక గ్యాస్ వినియోగం ఉంటే ఎక్స్‌ట్రా సిలిండర్ తీసుకోవడం మంచిది. ఒకే కనెక్షన్‌పై రెండు సిలిండర్లను పొందేందుకు డబుల్ బాటిల్ కనెక్షన్ సదుపాయం అందుబాటులో ఉంది. అయితే 5, 10 కేజీల చిన్న సిలిండర్లకు సబ్సిడీ సదుపాయం ఉండదు. కేవలం 14.2 కిలోల గృహ సిలిండర్లకు మాత్రమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ అందిస్తున్నాయి.

గ్యాస్ డెలివరీలకు ఓటీపీ ధృవీకరణను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీంతో మీ ఇంటికి వచ్చే డెలివరీ బాయ్‌కు ఓటీపీ చెప్పాలి. ఓటీపీ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత సిలిండర్ అందిస్తారు. ఓటీపీ ధృవీకరణ ప్రక్రియ పూర్తవ్వకపోతే సిలిండర్ డెలివరీ చేయరు. బ్లాక్ మార్కెటింగ్, సిలిండర్ల డెలివరీ అక్రమాలు, నిజమైన లబ్దిదారులకు మాత్రమే సిలిండర్లను సరఫరా చేసేందుకు ఈ ప్రక్రియ తీసుకొచ్చారు. అలాగే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ల బుకింగ్స్‌కు 25 రోజుల వెయిటింగ్ పీరియడ్ నిర్ణయించారు. దీని వల్ల ఒక సిలిండర్ డెలివరీ అయిన తర్వాత మరో సిలిండర్ వెంటనే బుక్ చేసుకోవడం కుదరదు. కొన్ని రోజులు ఆగాల్సి ఉంటుంది. ఇక సబ్సిడీ ధరలకు మీరు సిలిండర్ పొందాలంటే ఖచ్చితంగా కేవైసీ పూర్తి చేయాలి. ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే మార్కెట్ ధరలకే సిలిండర్ పొందాల్సి ఉంటుది.

 

Loading...
Unable to load recommendations.
Follow Us