Gas E-Kyc: గ్యాస్ సిలిండర్లు వాడేవారికి అదిరిపోయే న్యూస్.. ఈకేవైసీ గడువు మరింత పొడిగింపు.. అప్పటివరకు ఛాన్స్..

ఆయిల్ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఎల్పీజీ గ్యాస్ కేవైసీ గడువును మరింత పొడిగించాయి. 16వ తేదీతో గడువు ముగియగా.. సర్వర్ సమస్యల వల్ల చాలామంది పూర్తి చేయలేకపోయారు. దీని వల్ల డీలర్ షిప్ కార్యాలయాల వద్ద గంటల కొద్ది వేచి ఉండాల్సి వచ్చింది.

Gas E-Kyc: గ్యాస్ సిలిండర్లు వాడేవారికి అదిరిపోయే న్యూస్.. ఈకేవైసీ గడువు మరింత పొడిగింపు.. అప్పటివరకు ఛాన్స్..
Lpg Gas E Kyc Deadline
Image Credit source: AI Image

Updated on: Aug 17, 2026 | 1:48 PM

ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు భారీ గుడ్ న్యూస్. ఆగస్ట్ 16వ తేదీతో ముగిసిన ఈకేవైసీ గడువును ఆయిల్ కంపెనీలు ఆగస్ట్ 23వ తేదీ వరకు పొడిగించాయి. చాలామంది ఇంకా చేసుకోకపోవడంతో వారం రోజుల పాటు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నాయి. దీంతో వినియోగదారులు అప్పటికల్లా తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈకేవైసీ సర్వర్‌లో సమస్యలు తలెత్తడం, దీని వల్ల ఈ ప్రక్రియను పూర్తి చేయడంలో చాలామంది వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్న క్రమంలో పొడిగించాలని నిర్ణయించాయి. అయితే గడువు పొడిగించినా కేవైసీ ప్రక్రియలో సమస్యలు తలెత్తుతున్నట్లు డీలర్లు చెబుతున్నారు.

క్యూ కట్టిన వినియోగదారులు

గ్యాస్ కనెక్షన్లకు కేవైసీని పూర్తి చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఆగస్ట్ 16లోగా పూర్తి చేయాలని పదే పదే ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు హెచ్చరికలను వినియోగదారులకు జారీ చేశాయి. పదే పదే పూర్తి చేయనివారికి ఎస్‌ఎంఎస్‌లు పంపించాయి. అయినా సర్వర్ సమస్యల వల్ల చాలామంది పూర్తి చేయలేకపోయారు. దీంతో ఇప్పుడు గడువును మరింత పొడిగించాయి. కొంతమంది ఆధార్ ద్వారా కేవైసీని పూర్తి చేయడానికి ప్రయత్నించినప్పుడు సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్నారు. సర్వర్లు నిలిచిపోవడం, యాప్‌లు, పోర్టల్‌లు సరిగ్గా పనిచేయకపోవడం వంటి ఇబ్బందులు తలెత్తాయి. ఇక డీలర్ షిప్ కార్యాలయాల వద్ద వినియోగదారులు భారీగా క్యూ కట్టారు. గంటల తరబడి నిల్చున్నారు. కానీ టెక్నికల్ సమస్యల వల్ల పూర్తి చేయలేకపోయారు. అయితే గడువు పొడిగించినా పెద్దగా ప్రయత్నం లేదని గ్యాస్ ఏజెన్సీలు చెబుతున్నాయి. ఇప్పటికీ సర్వర్ సమస్య అలాగే కొనసాగుతుందని అంటున్నాయి. దీని వల్ల పనుల్లో వేగం తగ్గిందని ఆరోపిస్తున్నాయి. సర్వర్లు ఎక్కువసేపు పనిచేయకపోవడం వల్ల కేవైసీ పూర్తి చేసేందుకు ఆలస్యం అవుతుంది. క్యూలో నిల్చున్న వినియోగదారులు వెనక్కి వెళ్లిపోతున్నారు.

ఎలా పూర్తి చేయాలి..?

గ్యాస్ ఎవరి పేరు మీద అయితే ఉందో సదరు వ్యక్తులు తమ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం మీ ఏ కంపెనీ గ్యాస్ కనెక్షన్ తీసుకున్నారో.. ఆ కంపెనీ వెబ్ సైట్, యాప్‌లోకి లాగిన్ అయితే కేవైసీ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ  ఆప్షన్ ఎంచుకుని మీ ఆధార్ నెంబర్, గ్యాస్ కనెక్షన్ నెంబర్ నమోదు చేయడం వల్ల సలువుగా పూర్తి చేయవచ్చు. ఇక మీ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లి కూడా కంప్లీట్ చేయవచ్చు. అలాగే మీకు గ్యాస్ డెలివరీ చేయడానికి వచ్చే సిబ్బంది వద్ద ఉండే మెషీన్ ద్వారా కూడా కేవైసీ పూర్తి చేయవచ్చు. ఇలా అనేక ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us