మీకు ఎల్ఐసీ పాలసీ ఉందా..? సమయానికి ప్రీమియం కట్టలేక వదిలేసారా.. అయితే ఈ బంపర్ ఆఫర్ మీకోసమే..

|

Mar 05, 2021 | 7:46 PM

Lic Special Revival Campaign:మధ్యతరగతి కుటుంబాలలో చాలావరకు ఎల్ఐసీలో పక్క పాలసీ ఉంటుంది. తాజాగా తన కస్టమర్లకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మంచి

మీకు ఎల్ఐసీ పాలసీ ఉందా..? సమయానికి ప్రీమియం కట్టలేక వదిలేసారా.. అయితే ఈ బంపర్ ఆఫర్ మీకోసమే..
Follow us on

Lic Special Revival Campaign:మధ్యతరగతి కుటుంబాలలో చాలావరకు ఎల్ఐసీలో పక్క పాలసీ ఉంటుంది. తాజాగా తన కస్టమర్లకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మంచి శుభవార్త అందించింది. ఎక్కువమంది పాలసీదారులు కొన్నాళ్ళ వరకు ప్రీమియం సమయానికే చెల్లించి.. ఆ తర్వాత వివిధ కారణాల వాళ్ళ ఆపేయటం లాంటిది జరుగుతూ ఉంటుంది. దీంతో ఎల్‌ఐసీ పాలసీ లాప్స్ అవుతూ ఉంటాయి. ప్రీమియం చెల్లించలేక రెండేళ్లకు పైగా ల్యాప్స్ అయినా పాలసీలను పునరుద్ధరించుకోవచ్చునని తాజాగా సంస్థ స్పష్టం చేసింది. తద్వారా ల్యాప్స్ అయిన పాలసీలను పునరుద్ధరించుకునేందుకు ఓ చక్కటి అవకాశం ఇచ్చింది.

మార్చి 6 వరకు ఈ అవకాశం కల్పిస్తోంది. ప్రత్యేక పద్దతి ద్వారా మీ పాలసీని రన్ చేయవచ్చు. ఈ అవకాశాన్ని ఎల్‌ఐసీ పాలసీదారులు గమనించాలి. లేదంటే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ఎల్ఐసీ కొత్త రూల్స్ ప్రకారం.. సాంప్రదాయ నాన్ లింక్డ్ పాలసీ పునరుద్ధరణకు ఐదేళ్ల వరకు గడువు ఉంది. యూనిట్ లింక్డ్ పాలసీలకు 3 ఏళ్ల గడువు ఇచ్చింది సంస్థ. పాలసీ ల్యాప్స్ అయిన వారికి ఇది ఊహించని శుభవార్త అని చెప్పవచ్చు. దీంతో పాలసీదారులు వారి పాలసీల్ని తిరిగి పునరుద్ధరించుకోవచ్చునని తెలిపింది. పాలసీ ప్రయోజనాలను మళ్లీ యథావిధిగా పొందవచ్చు. అయితే లాప్స్ అయిన పాలసీలు రన్ చేయాలంటే అప్పటి వరకు ఆపేసిన కాలానికి వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. దీనికోసం సంస్థ కొన్ని నియమ నిబంధలను అమలు చేస్తోంది.

ల్యాప్స్ అయిన పాలసీని పునరుద్దరించేటప్పుడు వార్షిక ప్రీమియంలో రూ.లక్షకు ఆలస్య రుసుంలో 20 శాతం లేదా గరిష్టంగా రూ.2000 లభిస్తాయి. పాలసీదారు వార్షిక ప్రీమియం లక్ష నుంచి రూ.3 లక్షల వరకు ఉంటే అతడికి 25 శాతం లేదా రూ.2500 తగ్గింపు ఉంటుంది. ఇక మూడు లక్షల పై ఉంటే 30 శాతం లేదా రూ.3000 తగ్గింపు లభిస్తుంది. ఆరోగ్య భీమా, టర్మ్ ఇన్సూరెన్స్ మరియు బహుళ రిస్క్ పాలసీల వంటి అధిక రిస్క్ ప్లాన్ల విషయంలో, ఆలస్య రుసుములో మినహాయింపు ఉండదు.

Mike procter: వరుసగా 6 మ్యాచ్‌ల్లో 6 సెంచరీలు.. క్రికెట్ చరిత్రలో అలాంటి ఘనత ఎవరు సాధించారో తెలుసా..