LIC policy: మీ ఎల్‌ఐసీ పాలసీ ల్యాప్స్‌ అయ్యిందా.? మీ కోసమే ఈ సదవకాశం.. భారీ డిస్కౌంట్‌తో..

|

Aug 13, 2022 | 5:35 PM

LIC policy: అతిపెద్ద ఇన్సూరెన్స్‌ సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (LIC) పాలసీదారులకు శుభవార్త తెలిపింది. గతంలో పాలసీ తీసుకొని ప్రీమియం చెల్లించకపోవడంతో నిలిచిపోయిన (పాలసీ ల్యాప్స్‌) పాలసీలను...

LIC policy: మీ ఎల్‌ఐసీ పాలసీ ల్యాప్స్‌ అయ్యిందా.? మీ కోసమే ఈ సదవకాశం.. భారీ డిస్కౌంట్‌తో..
Follow us on

LIC policy: అతిపెద్ద ఇన్సూరెన్స్‌ సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (LIC) పాలసీదారులకు శుభవార్త తెలిపింది. గతంలో పాలసీ తీసుకొని ప్రీమియం చెల్లించకపోవడంతో నిలిచిపోయిన (పాలసీ ల్యాప్స్‌) పాలసీలను మళ్లీ పునరుద్ధరించుకోవడానికి అవకాశాన్ని కల్పించింది. కస్టమర్లు తమ పాలసీలను తిరిగి ఓపెన్‌ చేసుకోవడానికి ఆగస్టు 17 నుంచి అక్టోబర్‌ 21 వరకు ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహించనున్నారు. ఈ అవకాశాన్ని పాలసీదారులు వినియోగించుకోవాలని ఎల్‌ఐసీ తెలిపింది.

ఆర్థిక కారణాలు, మరే ఇతర కారణాలతో అయినా ప్రీమియం చెల్లించకపోడంతో ల్యాప్‌ అయిన పాలసీని తిరిగి పొందొచ్చని తెలిపారు. పాలసీలు ల్యాప్‌ అయిన వారి ఆర్థిక ప్రయోజనాలను కాపాడేందుకే తాము ఈ అవకాశాన్ని కల్పించామని ఎల్‌ఐసీ పేర్కొంది. జీవిత భీమా అనేది రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ అని, ఊహించని ప్రాణ నష్టం జరిగినప్పుడు పాలసీదారుల కుటుంబ సభ్యులకు భీమా భరోసా కల్పిస్తుందని వివరించింది. ఎల్‌ఐసీ తీసుకొస్తున్న ఈ ఆఫర్‌ ద్వారా అన్ని యులిప్‌-యేతర పాలసీలను 5 ఏళ్లలోపు లేట్‌ ఫీజు చెల్లించి పునరుద్ధరించుకోవచ్చు.

ఎల్‌ఐసీ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రీమియం రూ. లక్ష లోపు ఉంటే. ఆలస్య రుసుములో 25 శాతం డిస్కౌంట్‌ పొందొచ్చు. గరిష్టంగా రూ. 2500 రాయితీ అందిస్తారు. ఒకవేళ ప్రీమియం రూ. లక్ష కంటే ఎక్కువ రూ. 3 లక్షలలోపు ఉంటే 25 శాతం డిస్కౌంట్‌ ఇవ్వనున్నారు. గరిష్టంగా రూ. 3000 రాయితీ ఇస్తారు. ఇక రూ. 3 లక్షల కంటే ఎక్కువ ఉంటే గరిష్టంగా రూ. 3500 రాయితీతో 30 శాతం డిస్కౌంట్‌ ఇవ్వనున్నారు. ఇక మైక్రో ఇన్సూరెన్స్‌ పాలసీలను 100 శాతం ఆలస్యరుసుముతో పునరుద్ధరించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..