ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ తాజాగా కొత్త పాలసీని తీసుకొచ్చింది. కేవలం బీమాకే పరిమితం కాకుండా పొదుపు ప్లాన్‌ను కూడా అందించే ఈ ప్లాన్‌తో వినియోగదారులకు ఎంతో మేలు జరగనుంది. ఎల్‌ఐసీ జీవన్ ఉత్సవ్ పేరుతో ఈ కొత్త పాలసీని ఎల్‌ఐసీ ప్రవేశపెట్టింది. నవంబర్ 29వ తేదీన ఈ పాలసీని లాంచ్ చేశారు. ఇంతకీ ఈ పాలసీలో ఎంత ప్రీమియం చెల్లించాలి.? ఎలాంటి బెనిఫిట్స్ పొందొచ్చు.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ పాలసీ తీసుకున్న వారు ప్రీమియం టర్మ్, వెయిటింగ్ పీరియడ్ తర్వా ఏటా ఆదాయం పొందొచ్చు. ఒకవేళ మీరు రెగ్యులర్‌గా ఆదాయం వద్దనుకుంటే.. ఫ్లెక్సీ విధానం ఎంచుకునే అవకాశం ఉంది. దీనిద్వారా చక్రవడ్డీ ప్రయోజనం పొందొచ్చు. పాలసీ తీసుకున్న ఏడాది నుంచి బీమా సదుపాయం వర్తిస్తుంది. ఇక ఈ పాలసీని 90 రోజుల చిన్నారుల నుంచి 65 ఏళ్లులోపు వారు తీసుకొవచ్చు. పాలసీలో భాగంగా వివిధ రైడర్లను ఎంచుకోవచ్చు. పాలసీ ద్వారా లోన్ కూడా పొందొచ్చు.
పాలసీ చెల్లింపునకు 75 ఏళ్ల గరిష్ట వయసును నిర్ణయించారు. 5 ఏళ్ల నుంచి 16 ఏళ్ల వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. కనిష్ఠ బీమా మొత్తం రూ.5 లక్షలు. ఐదేళ్లు ప్రీమియం చెల్లించపు వ్యవధి సెలక్ట్ చేసుకుంటే 5 ఏళ్లు వేచి చూడాల్సి ఉంటుంది. అదే 6 ఏళ్లు ఎంచుకుంటే 4 సంవత్సరాలు, 7 ఏళ్లు ఎంచుకుంటే 3 సంవత్సరాలు, 8 నుంచి 16 ఏళ్లు సెలక్ట్ చేసుకుంటే.. 2 ఏళ్లు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. వెయిటింట్ ప్రీమియం పూర్తయిన తర్వాత.. ఎల్‌ఐసీ నుంచి బీమా హామీ మొత్తంలో ఏటా 10 శాతం చొప్పున జీవితాంతం ఆదాయం పొందొచ్చు. జీవించి ఉన్నంతకాలం జీవిత బీమా హామీ ఉంటుంది.
ప్రీమియం చెల్లింపు, వెయిటింగ్ పీరియడ్ ముగిసిన తర్వాత.. పాలసీదారుడికి జీవితాంతం ఈ ప్లాన్ కింద ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్లాన్‌లో రెండు రకాల ఆప్షన్లు ఉంటాయి. ఒకటి రెగ్యులర్ ఆదాయం. రెండోది ఫ్లెక్సీ ఆదాయం. మొదటి ఆప్షన్ ఎంచుకుంటే ఏటా చివర్లో బేసిక్ మొత్తం నుంచి 10 శాతం ఆదాయం వస్తుంది. అదే ఆప్షన్-2 సెలక్ట్ చేసుకునే.. బీమా మొత్తంలో 10 శాతం ప్రతిఫలం అందుతుంది. లేదు.. మొత్తానికి తీసుకోకపోతే 5.5 శాతం చొప్పున చక్రవడ్డీ లభిస్తుంది. ఒకవేళ పాలసీదారుడు అకాల మరణం పొందితే.. డెత్ బీమా మొత్తంతో పాటు గ్యారెంటీడ్ అడిషన్స్‌ను ఎల్‌ఐసీ చెల్లిస్తుంది.
ఈ పాలసీ తీసుకోవాలంటే కనీస బీమా మొత్తం రూ. 5 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు 25 ఏళ్లు ఉన్న ఓ వ్యక్తి 12 ఏళ్ల ప్రీమియం టర్మ్‌కు రూ.10 లక్షల కనీస హామీ మొత్తంపై పాలసీ తీసుకున్నారనుకుందాం. పాలసీదారుడు ఏటా రూ. రూ.86,800 చెల్లించాల్సి ఉంటుంది. ఇలా 12 ఏళ్లు అంటే 36 ఏళ్లు వచ్చే వరకు చెల్లించాలి. రెండేళ్లు వెయిటింగ్ పీరియడ్ అంటే 38వ ఏట నుంచి ఆదాయం మొదలవుతుంది. ఏటా 10 శాతం అంటే రూ. లక్ష ఆదాయం వస్తుంది. అలా కాకుండా రెండో ఆప్షన్ ఎంచుకుంటే.. ఫ్లెక్సీ ఆదాయం కింద.. మరుసటి ఏడాది 5.5 శాతం వడ్డీ జమ అవుతుంది అంటే.. 1.05 లక్షలు అవుతుంది. ఆపై ఏటా జమ అయ్యే మొత్తంపై 5.5 శాతం చొప్పున వడ్డీ ఆదాయం లభిస్తుంది. దీంతో పాలసీదారుడు 60 ఏళ్లు వచ్చే సరికి రూ. 22 లక్షల రెగ్యులర్ ఆదాయం వస్తుంది. ఫ్లెక్సీ ఆప్షన్ ఎంచుకుంటే.. రూ.22 లక్షలతో పాటు చక్రవడ్డీ రూపంలో వచ్చిన మొత్తంతో కలిపి రూ.43.11 లక్షలు పొందొచ్చు. పాలసీదారుడు ఎప్పుడైనా సమకూరిన మొత్తంలోచి 75 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆపై మిగిలిన మొత్తంపై వడ్డీ వస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..