LIC Policy: సామాన్యులకు అదిరిపోయే పాలసీ.. ప్రతీ నెలా 63 రూపాయలు చెల్లిస్తే.. మెచ్యూరిటీకి అధిక రాబడి!

|

Apr 11, 2022 | 1:22 PM

దిగ్గజ బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్(LIC) సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఎన్నో రకాల పాలసీ స్కీమ్స్‌ను అమలు..

LIC Policy: సామాన్యులకు అదిరిపోయే పాలసీ.. ప్రతీ నెలా 63 రూపాయలు చెల్లిస్తే.. మెచ్యూరిటీకి అధిక రాబడి!
Lic Policy
Follow us on

దిగ్గజ బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్(LIC) సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఎన్నో రకాల పాలసీ స్కీమ్స్‌ను అమలు చేస్తోంది. వీటిల్లో ఒకటి భాగ్యలక్ష్మి పాలసీ. ఇది తక్కువ ఆదాయం ఉన్నవారి కోసం అందించే సూక్ష్మ బీమా పథకం. భాగ్యలక్ష్మి పాలసీ ప్రీమియం రిటర్న్‌తో వచ్చే టర్మ్ ప్లాన్. మెచ్యూరిటీ సమయానికి చెల్లించే ప్రీమియం‌లకు 110 శాతం తిరిగి వస్తుంది. ఇది పరిమిత ప్రీమియం చెల్లింపు ప్లాన్. ఇందులో ప్రీమియంలు పాలసీ మెచ్యూరిటీ వరకు చెల్లించాల్సి అవసరం లేదు.

ఈ పాలసీని తీసుకునేందుకు కనీస వయోపరిమితి 19 సంవత్సరాలు ఉండాలి. అలాగే గరిష్టంగా 55 సంవత్సరాలుగా నిర్ణయించారు. అటు ప్రీమియం చెల్లింపు వ్యవధి కనిష్టంగా 5 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాలుగా ఉంది. పాలసీ తీసుకుని.. రెండు సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లిస్తే.. జీవిత బీమా సౌకర్యం లభిస్తుంది. ఈ పాలసీని రూ. 20-50 వేల వరకు తీసుకోవచ్చు. పాలసీ కింద ప్రీమియంలను నెలవారీ, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరం వారీ ప్రాతిపదికన చెల్లించవచ్చు.

ఎల్‌ఐసీ భాగ్యలక్ష్మి పాలసీ కింద, డిపాజిటర్‌కు రుణం తీసుకునే సౌకర్యం లేదు. కానీ పాలసీని సరెండర్ చేసుకునే వెసులుబాటు మాత్రం ఉంది. ఒకవేళ డిపాజిటర్ పాలసీని సరెండర్ చేస్తే, అతడికి డిపాజిట్ చేసిన మొత్తంలో 30-90 శాతం ఇస్తారు. ఇక ఆ మొత్తం పాలసీ కొనసాగిన కాలవ్యవధికి అనుగుణంగా ఉంటుంది.

ఉదాహరణకు ఓ వ్యక్తి రూ. 20 వేల హామీ మొత్తానికి ఎల్‌ఐసీ భాగ్యలక్ష్మీ పాలసీని తీసుకున్నారని అనుకుందాం.. ప్రీమియం చెల్లింపు వ్యవధిని 13 సంవత్సరాలుగా ఎంచుకున్నారు.. ఆ వ్యక్తి ప్రతి సంవత్సరం రూ.756 చొప్పున ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అంటే.! ప్రతీ నెలా 63 రూపాయలు అన్నమాట. ఇలా 13 ఏళ్లు ఆ వ్యక్తి మొత్తంగా రూ.9,823 చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఈ పాలసీ మెచ్యూరిటీ కాల వ్యవధి 15 ఏళ్లు. అంటే.. ఇతడికి ప్రీమియం చెల్లించిన రెండేళ్ల తర్వాత లైఫ్ కవరేజ్ లభిస్తుంది. ఈ 15 ఏళ్లలోపు సదరు వ్యక్తి దురదృష్టవశాత్తు మరణించినట్లయితే.. అతడి నామినీకి రూ. 20 వేల హామీ మొత్తం అందుతుంది. ఒకవేళ డిపాజిటర్ జీవించి ఉన్నట్లయితే.. హామీ మొత్తంతో పాటు, ప్రీమియంపై 110 శాతం అంటే రూ.10,805 కూడా లభిస్తుంది.

గమనిక: ఈకథనంలో అందించిన సమాచారం కేవలం అవగాహన కోసమే. ఎల్‌ఐసీ పాలసీలు, స్టాక్ మార్కెట్‌తోపాటు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే ముందు, నిపుణుల సలహాలు తీసుకోవడం చాలా మంచిది.

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.