Bank Loan: ఈ బ్యాంకులో రుణాలు తీసుకునేవారికి అద్భుతమైన పండగ ఆఫర్‌.. వడ్డీ రేట్ల తగ్గింపు

Bank Loan: ప్రస్తుతం బ్యాంకు రుణాలు తీసుకునేవారి సంఖ్య పెరిగిపోయింది. ఆర్థికంగా వెనుకబడి వివిధ అవసరాల నిమిత్తం లోన్స్‌ తీసుకుంటున్నారు. ఎక్కువగా..

Bank Loan: ఈ బ్యాంకులో రుణాలు తీసుకునేవారికి అద్భుతమైన పండగ ఆఫర్‌.. వడ్డీ రేట్ల తగ్గింపు
Personal Loan

Updated on: Sep 10, 2021 | 7:40 AM

Bank Loan: ప్రస్తుతం బ్యాంకు రుణాలు తీసుకునేవారి సంఖ్య పెరిగిపోయింది. ఆర్థికంగా వెనుకబడి వివిధ అవసరాల నిమిత్తం లోన్స్‌ తీసుకుంటున్నారు. ఎక్కువగా గృహ రుణాలు తీసుకుంటున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. ఇక తాజాగా ప్రైవేట్ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంకు అయిన కోటక్ మహీంద్రా బ్యాంక్ రుణ గ్రహీతలకు శుభవార్త అందించింది. పండుగ ఆఫర్ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో హోమ్ లోన్ తీసుకునే వారికి ఊరట కలుగనుంది.

తక్కువ వడ్డీకే లోన్‌..

కోటక్ మహీంద్రా బ్యాంక్ పండుగ ఆఫర్‌లో భాగంగా తక్కువ వడ్డీకే హోమ్ లోన్స్ అందిస్తోంది. ఇంటి కోసం రుణం తీసుకుంటే వడ్డీ రేటు 6.5 శాతం నుంచి ప్రారంభం అవుతుంది. ఇది తక్కువ వడ్డీ అని చెప్పుకోవాలి. వచ్చే 60 రోజుల వరకే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

మీరు కొత్తగా రుణం తీసుకున్నా .. లేదంటే బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకున్నా ఇదే వడ్డీ రేటు వర్తిస్తుందని బ్యాంక్ వెల్లడించింది. సెప్టెంబర్ 10 నుంచి నవంబర్ 8 వరకు ఆఫర్ అందుబాటులో ఉంటుందని బ్యాంకు తెలిపింది. మీరు సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావిస్తే.. వెంటనే ఆఫర్ ఉపయోగించుకోవచ్చు.

హోమ్‌ లోన్‌పై ఇది వరకు వడ్డీ రేటు..

కాగా, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇది వరకు హోమ్ లోన్స్‌పై వడ్డీ రేటు 6.65 శాతంగా ఉండేది. అయితే పండుగ సీజన్ కారణంగా ఈ ఆఫర్ అందుబాటులోకి తీసుకువచ్చింది. వడ్డీ రేటును 15 బేసిస్ పాయింట్ల మేర తగ్గించేసింది. దీంతో హోమ్ తీసుకునే వారు ఈ బెనిఫిట్‌ పొందవచ్చు.

 

ఇవీ కూడా చదవండి:

LIC Policy: మీకు ఎల్ఐసీలో పాలసీ ఉందా..? వెంటనే ఈ పని పూర్తి చేసుకోండి.. లేకపోతే ఇబ్బందే..!

iMobile Pay App: మీ ఫోన్‌లో ఒక్క యాప్‌ ఉంటే చాలు.. ఏ బ్యాంకు క్రెడిట్‌ బిల్లు అయినా చెల్లించవచ్చు!