Komaki EV Scooter: ఈవీ ప్రియులకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన కొమాకీ ఈవీ కంపెనీ.. అదిరిపోయే పండుగ ఆఫర్ల ప్రకటన

| Edited By: Ravi Kiran

Oct 30, 2023 | 7:20 AM

ఈవీ స్కూటర్లకు అనూహ‍్యంగా డిమాండ్‌ పెరగడంతో అన్ని కంపెనీలు ఈవీ స్కూటర్లను లాంచ్‌ చేశాయి. టాప్‌ కంపెనీల నుంచి స్టార్టప్‌ కంపెనీల వరకూ అన్ని కంపెనీలు ఈవీలను అందుబాటులో ఉంచాయి. ముఖ్యంగా ప్రస్తుతం భారతదేశంలో పండుగ సీజన్ల నేపథ్యంలో ఈవీలపై డిస్కౌంట్లను కూడా అందిస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఈవీ కంపెనీ కొమాకీ తన ఎస్‌ఈ డ్యూయల్‌ వెర్షన్‌ స్కూటర్‌పై ఆఫర్లను అందిస్తుంది. కొ

Komaki EV Scooter: ఈవీ ప్రియులకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన కొమాకీ ఈవీ కంపెనీ.. అదిరిపోయే పండుగ ఆఫర్ల ప్రకటన
Komali Se
Follow us on

ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్‌ రంగంలో ఈవీ వాహనాల ట్రెండ్‌ నడుస్తుంది. ముఖ్యంగా భారతదేశంలో ఈవీ స్కూటర్లు ఎక్కువ సంఖ్యలో అమ్ముడవుతున్నాయి. పెరుగుతున్న పెట్రోల్‌ ధరలకు ప్రత్యామ్నాయంగా మధ్యతరగతి ప్రజలు ఈవీ స్కూటర్లను ఎంచుకుంటున్నారు. ఈవీ స్కూటర్లపై ఎన్ని భయాలు ఉన్నా వాటి సేల్స్‌ మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఈవీ స్కూటర్లకు అనూహ‍్యంగా డిమాండ్‌ పెరగడంతో అన్ని కంపెనీలు ఈవీ స్కూటర్లను లాంచ్‌ చేశాయి. టాప్‌ కంపెనీల నుంచి స్టార్టప్‌ కంపెనీల వరకూ అన్ని కంపెనీలు ఈవీలను అందుబాటులో ఉంచాయి. ముఖ్యంగా ప్రస్తుతం భారతదేశంలో పండుగ సీజన్ల నేపథ్యంలో ఈవీలపై డిస్కౌంట్లను కూడా అందిస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఈవీ కంపెనీ కొమాకీ తన ఎస్‌ఈ డ్యూయల్‌ వెర్షన్‌ స్కూటర్‌పై ఆఫర్లను అందిస్తుంది. కొమాకీ అందిస్తున్న ఆఫర్ల వివరాలేంటో? ఓసారి తెలుసుకుందాం.

కొమాకీ కంపెనీ పండుగ సీజన్‌లో స్కూటర్‌ను కొనుగోలు చేసిన వారికి ఉచితంగా బ్యాటరీను అందిస్తుంది. కొమాకీ ఎస్‌ డ్యూయల్‌ స్కూటర్‌పై బ్యాటరీతో పాటు చార్జర్‌ను కూడా ఉచితంగా పొందవచ్చు. ఈ బ్యాటరీను ఓ సారి చార్జ్‌ చేస్తే 200 కిలోమీటర్ల మైలేజ్‌ ఇస్తుంది. కొమాకీ ఎస్‌ డ్యూయల్‌ స్కూటర్‌ వినియోగదారులకు రెండు సరికొత్త రంగుల్లో అందుబాటులో ఉంటుంది. చార్కోల్‌ గ్రే, శాక్రమెంటో గ్రీన్‌ రంగుల్లో కొనుగోలుకు సిద్ధంగా ఉంది. ఈ స్కూటర్‌ ధర ప్రస్తుతం రూ.1.28 లక్షలుగా ఉంది. ఈ స్కూటర్‌ ఓలా, ఏథర్‌, టీవీఎస్‌ ఐక్యూబ్‌ స్కూటర్లకు గట్టి పోటీనిస్తుంది. ఈ స్కూటర్‌కు సంబంధించిన ఇతర ఫీచర్లపై ఓ లుక్కేద్దాం.

కొమాకీ 2023 ప్రారంభంలో ఎస్‌ఈ స్కూటర్లను పునరుద్ధరించింది. ఈ మోడల్‌ స్కూటర్లు మెరుగైన భద్రతా ఫీచర్లతో వస్తాయి. అగ్నినిరోధకత కోసం లైఫ్‌పీఓ 4 బ్యాటరీలతో వస్తుంది. ఈ బ్యాటరీలను కేవలం 4 నుంచి 5 గంటల్లో పూర్తిగా చార్జ్‌ చేయవచ్చు. కొమాకీ ఎస్‌ఈ శ్రేణిలో 3000 వాట్‌ హబ్‌ మోటర్‌తో వస్తుంది. ఎల్‌ఈడీ సూచికలతో ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌, కీ లెస్‌ ఎంట్రీ, పార్క్‌ అసిస్ట్‌, క్రూయిజ్‌ కంట్రోల్‌, రివర్స్‌ అసిస్ట్‌ వంటి అధునాతన ఫీచర్లు ఈ స్కూటర్‌ సొంతం. మోడల్‌ నావిగేషన్‌, రెడీ టు రైడ్‌, సౌండ్‌ సిస్టమ్‌కు సపోర్ట్‌ చేసే టీఎఫ్‌టీ ఎల్‌ఈడీ స్క్రీన్‌తో పాటు మూడు రైడ్‌ మోడ్స్‌తో ఈ స్కూటర్‌ వినియోగదారులను ఆకట్టకుంటుంది. ఈ స్కూటర్‌ ఎకో, స్పోర్ట్‌, టర్బో వంటి రైడింగ్‌ మోడ్స్‌తో పాటు యాంటీ స్కిడ్‌ టెక్నాలజీతో ఇరువైపులా డిస్క్‌ బ్రేక్‌లతో ఆకర్షణీయంగా ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..