పాడైన కరెన్సీ నోట్లను.. ఫ్రీగా ఎస్‌బీఐ‌లో మార్చుకోండిలా..

| Edited By:

Jun 25, 2020 | 5:38 PM

మీ దగ్గర పాడైపోయిన కరెన్సీ నోట్లు ఉన్నాయా? అవి ఎక్కడా చెల్లుబాటు కావడం లేదా? వాటిని ఏం చేయాలా అని దీర్ఘంగా ఆలోచిస్తున్నారా? టెన్షన్ అవసరం లేదు. వాటిని నేరుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) బ్యాంకులో ఈజీగా ఫ్రీగా మార్చుకోవచ్చు. అదెలాగ అంటారా? రూ.5 వేల లోపు ఉన్న 20 నోట్లను...

పాడైన కరెన్సీ నోట్లను.. ఫ్రీగా ఎస్‌బీఐ‌లో మార్చుకోండిలా..
Follow us on

మీ దగ్గర పాడైపోయిన కరెన్సీ నోట్లు ఉన్నాయా? అవి ఎక్కడా చెల్లుబాటు కావడం లేదా? వాటిని ఏం చేయాలా అని దీర్ఘంగా ఆలోచిస్తున్నారా? టెన్షన్ అవసరం లేదు. వాటిని నేరుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) బ్యాంకులో ఈజీగా ఫ్రీగా మార్చుకోవచ్చు. అదెలాగ అంటారా? రూ.5 వేల లోపు ఉన్న 20 నోట్లను మీరు ఉచితంగా మార్చుకోవచ్చు. ఒకవేళ అంతకన్నా ఎక్కువగా నోట్లు ఎక్స్‌ఛేంజ్ చేయాలనుకుంటే సర్వీస్ ఛార్జ్ చెల్లించాలన్నమాట.

గతేడాది అక్టోబర్‌ నెలలోనే ఈ పాడైన పాత నోట్ల మార్పిడి ఛార్జీలను సవరించింది ఎస్‌బీఐ. ఈ క్రమంలో రూ.5 వేల కంటే మీ పాత నోట్లు ఎక్కువగా ఉంటే.. నోటుకు రెండు రూపాయలతో పాటు జీఎస్టీ కూడా కలిపి చెల్లించాలి. ఆర్బీఐ నోట్ రీఫండ్ రూల్స్‌నే ఎస్‌బీఐ పాటిస్తుంది. పాడైన, ముక్కలైన నోట్లను మాత్రమే బ్యాంకు ఎక్స్‌ఛేంజ్ చేస్తుంది. అలాగే ఒక నోటు రెండు ముక్కలైతే.. ఆ నోటు అన్ని భాగాలను సరిగ్గా అతికించినా బ్యాంకు ఎక్స్‌ఛేంజ్ చేస్తుంది. అయితే మోసం చేసేందుకు నోట్లు పాడుచేసినట్టు అనుమానం వస్తే బ్యాంకు ఆ నోట్లను మార్చుకోదు. అలాగే కరెన్సీ నోట్లపై ఏదైనా రాజకీయ పార్టీకి చెందిన నినాదాలు రాసి ఉన్నా ఆ నోటు చెల్లదు. అలాంటి నోట్లను తిరస్కరించే హక్కు బ్యాంకులకు ఉంటుంది.

Read More: 

బ్రేకింగ్: వైసీపీ ఎమ్మెల్యే మనవడికి కరోనా పాజిటివ్..

ఫెయిర్&లవ్లీ: హెచ్‌యూఎల్ సంచలన నిర్ణయం.. ‘ఫెయిర్’ తొలగింపు..

పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్.. వంతెన పై నుంచి పడడంతో భారీ ధ్వంసం..

దారుణ హత్య.. టిఫిన్ బాక్సులో తల.. ఇంటిలో మొండెం..!