Stock Exchange: ఈ షేర్లు కొన్నవారికి వద్దంటే డబ్బు.. ఏడాదిలో మూడింతల ఆదాయం..

జూపిటర్ వ్యాగన్స్ లిమిటెడ్ (జేడబ్ల్యూఎల్) షేర్లు రికార్డు సృష్టించాయి. గరిష్ట స్థాయిలో రూ.448కి చేరుకున్నాయి. మే తొమ్మిదో తేదీన ఇంట్రా డే ట్రేడ్‌లో భారీ వాల్యూమ్‌ల మధ్య బీఎస్‌ఈలో పది శాతం పెరిగాయి. మార్చి త్రైమాసికంలో నెట్‌ ప్రాఫిట్‌ రూ.104.22 కోట్లకు పెరిగింది. ఇదే సంస్థ ఏడాది క్రితం కేవలం రూ. 40.78 కోట్ల ఆదాయం ఆర్జించింది. గతేడాదితో పోల్చితే ఈసారి దాదాపు మూడింతల ఆదాయం పెరిగింది.

Stock Exchange: ఈ షేర్లు కొన్నవారికి వద్దంటే డబ్బు.. ఏడాదిలో మూడింతల ఆదాయం..
Share Market

Updated on: May 12, 2024 | 2:44 PM

షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య ఇటీవల కాలంలో అధిమవుతోంది. తక్కువ కాలంలో ఎక్కువ రాబడిని ఇవి ఇస్తుండటంతో అందరూ వీటిల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఈ షేర్ మార్కెట్ అనేది అనిశ్చితికి మారుపేరు. రిస్క్ చాలా ఎక్కువ అయితే. అయితే ఓ షేర్ మాత్రం అద్భుతమైన రాబడులను అందిస్తోంది. దానిలో పెట్టుబడులు పెట్టిన మదుపరులకు ఎనలేని లాభాలు తెచ్చిపెడోతోంది. అవి జూపిటర్ వ్యాగన్స్ లిమిటెడ్ (జేడబ్ల్యూఎల్) షేర్లు. ఇవి రికార్డు సృష్టించాయి. గరిష్ట స్థాయిలో రూ.448కి చేరుకున్నాయి. మే తొమ్మిదో తేదీన ఇంట్రా డే ట్రేడ్‌లో భారీ వాల్యూమ్‌ల మధ్య బీఎస్‌ఈలో పది శాతం పెరిగాయి. మార్చి త్రైమాసికంలో (Q4FY24) నెట్‌ ప్రాఫిట్‌ రూ.104.22 కోట్లకు పెరిగింది. ఇదే సంస్థ Q4FY23లో (ఏడాది క్రితం) కేవలం రూ. 40.78 కోట్ల ఆదాయం ఆర్జించింది. గతేడాదితో పోల్చితే ఈసారి దాదాపు మూడింతల ఆదాయం పెరిగింది.

పెరిగిన ఆదాయం..

ఈ స్టాక్ 2024 ఏప్రిల్ 25 రూ.442.15కు చేరుకుంది. మే తొమ్మిదిన దానిని అధిగమించి 448కి వచ్చింది. త్రైమాసిక సమీక్షలో జూపిటర్ వ్యాగన్స్ ఆదాయం సంవత్సరానికి 57 శాతం పెరిగి రూ. 1,121 కోట్లకు చేరుకుంది. సంవత్సరం క్రితం ఇదే త్రైమాసికంలో కేవలం రూ.712.71 కోట్లుగా ఉంది.

పలు ఒప్పందాలు..

జూపిటర్ వ్యాగన్స్ లిమిటెడ్ ఆర్డర్ బుక్ స్థానం 2024 నాటికి రూ. 7,101.66 కోట్లుగా ఉంది. ఈ త్రైమాసికంలో ఈ కంపెనీ 2,237 బీఓఎస్ఎమ్ వ్యాగన్ల తయారీ, సరఫరా కోసం రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి సుమారు రూ. 957 కోట్ల ఒప్పందాన్ని పొందింది. అలాగే 697 బోగీ ఓపెన్ మిలిటరీ (బీఓఎమ్) వ్యాగన్ల తయారీ, సరఫరా కోసం కూడా మరో ఒప్పదం ఉంది. దీని విలువ దాదాపు రూ. 473 కోట్లు.

అగ్రగామిగా..

ప్రైవేటు వ్యాగన్ సరఫరాదారులలో జూపిటర్ వ్యాగన్ లిమిటెడ్ అగ్రగామిగా కొనసాగుతోంది. దీనితో పాటు ఇ-ఎల్‌సీవీల ప్రారంభం, బ్రేక్ సిస్టమ్‌లు, బ్రేకింగ్ వ్యాపారాలను పెంచే ప్రణాళిక ద్వారా వచ్చే ఏడాదికి మరింత ముందుకు దూసుకుపోతుందని భావిస్తున్నారు. విజయవంతమైన టెండర్ బిడ్లు, స్థిరమైన, ఆరోగ్యకరమైన ఆర్డర్లు రావడం, చక్కని కార్యాచరణ, సమర్థవంతమైన ఉత్పత్తి సామర్థ్యం తదితర విషయాలు విజయానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. జేడబ్ల్యూఎస్ అనేది ఫ్రైట్ వ్యాగన్లు, లోకోమోటివ్‌లు, ప్యాసింజర్ కోచ్‌లు (ఎల్ హెచ్ బీ), బ్రేకింగ్ సిస్టమ్‌లు, మెట్రో కోచ్, కమర్షియల్ వెహికల్స్, ఐఎస్ వో మెరైన్ కంటైనర్లు, కప్లర్లు, డ్రాఫ్ట్ గేర్లు, బోగీలు, సీఎమ్ఎస్ తదితర వాటిని ఉత్పత్తి చేస్తుంది.

అతిపెద్ద వ్యాగన్ తయారీదారు..

దేశంలోనే అతిపెద్ద వ్యాగన్ తయారీదారులలో జూపిటర్ వ్యాగన్స్ ఒకటి. 2025 నాటికి సంవత్సరానికి 12,000 వ్యాగన్‌లకు సామర్థ్యాన్ని పెంచుకోవడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఇనుము, ఉక్కు, పవర్, లాజిస్టిక్స్, మైనింగ్, సిమెంట్ తదితర రంగాలలో ప్రభుత్వ, ప్రైవేట్ ఖాతాదారులతో బలమైన సంబంధాలు ఏర్పరుచుకుంది, ఫలితంగా ఈ సంస్థకు స్థిరమైన ఆర్డర్ ఇన్‌ఫ్లో ఉంది. జేడబ్ల్యూఎల్‌ సాంకేతిక పరిజ్ఞానం, సామర్థ్యాలను గ్లోబల్ ఎంటీటీలతో టెక్నాలజీ భాగస్వామ్యాలు బలోపేతం చేశాయి. ఫలితంగా దీని ఉత్పత్తి విస్తృతంగా పెరిగింది.

స్టాక్ మార్కెట్ అంటే..

మీరు స్టాక్ లను కొనుగోలు చేయడానికి, అమ్మడానికి ప్రత్యేక మార్కెట్లు ఉన్నాయి. షేర్ మార్కెట్లో వీటిని జారీ చేస్తారు, అలాగే విక్రయిస్తారు. వీటిలో పెట్టుబడి దారులు తమ షేర్లలను మార్పిడి చేసుకోవచ్చు. దేశంలో ప్రధానంగా రెండు మార్కెట్లు ఉన్నాయి. వాటిలో మొదటిది నేషనల్ స్టాక్ ఎక్స్చేంచ్ (ఎస్ఎస్ఈ), రెండోది బాంబే స్టాక్ ఎక్స్చేంచ్ (బీఎస్ఈ). ఉదాహరణకు మీరు కంపెనీ షేర్ల కొనుగోలు చేసినప్పుడు వాటిలో పెట్టుబడి పెడుతున్నట్టు లెక్క. అలాగే వాటి ధర పెరిగి విక్రయించినప్పుడు మీకు లాభం వస్తుంది. ఈ మార్కెట్ లో అందరికీ అవకాశం ఉంది. ఆన్ లైన్ ట్రేడింగ్ అందుబాటులో ఉన్నందున ఎవరైనా వీటిని ట్రేడ్ చేయవచ్చు. అయితే వివిధ కంపెనీల స్టాక్ లను కొనుగోలు చేసేమందు వాటి ప్రాథమిక నియమాలు తెలుసుకోవాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us