Jio Plans: నెలకు రూ.200తో 15 ఓటీటీలు ఫ్రీగా చూడండి.. జియో అదిరిపోయే ప్లాన్..

ఓటీటీలు ఎక్కువగా చేసే అలవాటు ఉందా.. ఒక్కొ ఓటీటీ కోసం ప్రత్యేకంగా డబ్బులు చెల్లిస్తున్నారా.. అయితే మీ కోసం జియో అదిరిపోయే ప్లాన్ తీసుకొచ్చింది. కేవలం నెలకు రూ.200 కడితే చాలు.. 15 ఓటీటీ యాప్‌లు ఉచితంగా లభిస్తాయి. ఈ ప్లాన్ వివరాలు చూద్దాం.

Jio Plans: నెలకు రూ.200తో 15 ఓటీటీలు ఫ్రీగా చూడండి.. జియో అదిరిపోయే ప్లాన్..
Jio

Updated on: May 27, 2026 | 1:11 PM

ఓటీటీలు ఎక్కువ చూసేవారికి గుడ్ న్యూస్. మీ కోసం జియో అదిరిపోయే ప్లాన్ తీసుకొచ్చింది.  బుధవారం రూ.200 జియో OTT పాస్‌ను విడుదల చేసింది.  28 రోజుల వ్యాలిడిటీతో  ఈ ప్యాక్ ఉండనుండా..  15 ప్రీమియం OTT యాప్‌లను యాక్సెస్ చేయవచ్చు. అలాగే  జియో టీవీలో 1,000కుపైగా లైవ్ టీవీ ఛానెల్స్ చూడవచ్చు. ఇంతేకాదు 30 GB హైస్పీడ్ డేటాతో పాటు అపరిమిత 5Gను పొందవచ్చు.  మే 27వ తేదీ నుంచి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఛానెల్స్‌లో ఈ ప్యాక్ అందుబాటులోకి తెచ్చినట్లు జియో వర్గాలు తెతిపాయి. యాక్టివ్ బేస్ ప్లాన్ ఉన్న అన్ని జియో వినియోగదారులకు ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ కొత్త ప్లాన్ ప్రత్యేకత ఏంటంటే.. వీడియో స్ట్రీమింగ్, లైవ్ టెలివిజన్, హై-స్పీడ్ కనెక్టివిటీ ఒకే ప్యాక్‌లో అందిస్తుంది.  కేవలం రూ.200కే నెలకురూ.1,500 విలువైన ప్రయోజనాలను పొందవచ్చని జియో పేర్కొంది.

టీవీ, టాబ్లెట్, మొబైల్ పరికరాల్లో ప్రకటనలు లేకుండా వీక్షించవచ్చు. అలాగే  యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితంగా ఈ ప్యాక్‌లో అందిస్తున్నారు. అదనంగా, లైవ్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ ఓరిజినల్స్, బ్లాక్‌బస్టర్ హాలీవుడ్ కంటెంట్ కోసం జియోహాట్ స్టార్ మొబైల్+ హాలీవుడ్ పొందవచ్చు. ఇక మొబైల్‌లో అమెజాన్‌లో ప్రైమ్ వీడియో యాక్సెస్ కోసం ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ పొందవచ్చు. అంతేకాకుండా జియో టీవీ ద్వారా SonyLiv, ZEE5, Lionsgate Play, Discovery+, Sun NXT, FanCode, Kanccha Lannka, Planet Marathi, Chaupal, Hoichoi, TimesPlay, Tarang Plus వంటి మరో 12 OTT ప్లాట్‌ఫారమ్‌లను ఉచితంగా యాక్సెస్ చేయవచ్చు.

ఈ ఓటీపీ పాస్‌లో 30 జీబీ హై-స్పీడ్ 4జీ లేదా 5జీ డేటాతో పాటు అపరిమిత 5G యాక్సెస్‌ పొందవచ్చు.  MyJio, Jio.com, రిటైల్ పాయింట్స్ ఆఫ్ సేల్ (GT మరియు RR), అలాగే థర్డ్-పార్టీ రీచార్జ్ యాప్‌లు సహా అన్ని జియో ఛానెల్స్‌, అన్ని టెలికాం సర్కిల్స్‌లో ఈ ప్యాక్ అందుబాటులో ఉంది. ఈ పాస్‌ను యాక్టివేట్ చేసుకోవడానికి వినియోగదారులు తప్పనిసరిగా యాక్టివ్ బేస్ ప్లాన్ కలిగి ఉండాలి

Follow Us