
జియో ఐపీఓకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఒకే డీమ్యాట్ అకౌంట్ నుంచి జియో ఐపీఓకు రెండుసార్లు అప్లై చేసుకోవచ్చని వార్త చక్కర్లు కొడుతోంది. డీమ్యాట్ అకౌంట్ ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లను కొనుగోలు చేస్తే వాటాదారుల రిజర్వేషన్ కింద జియో ఐపీఓకు కూడా అప్లై చేసుకోవచ్చనే ప్రచారం నడుస్తోంది రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో షేర్లు కలిగి ఉన్న ఇన్వెస్టర్లకు జియో ఐపీఓలో షేర్‌హోల్డర్ రిజర్వేషన్ కేటగిరీ కింద అప్లై చేసుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇక సాధారణ రిటైల్ ఇన్వెస్టర్ కేటగిరీలో కూడా మరోసారి జియో ఐపీఓకు దరఖాస్తు చేసుకోవచ్చనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. గతంలో కోల్ ఇండియా, హీరో మోటోకార్ప్, ఎన్‌ఎల్‌సీ ఐపీఓల సమయంలో కూడా ఇలాంటి టెక్నిక్‌ను ఇన్వెస్టర్లు ఉపయోగించినట్లు ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై అనేక చర్చలు జరుగుతున్నాయి. ఒకే డీమ్యాట్ ఖాతా లేదా ఒకే పాన్ నుంచి రెండు వేర్వేరు కేటగిరీల్లో దరఖాస్తు చేసుకోవచ్చా.. లేదా అనే దానిపై చర్చ జరుగుతోంది. ఇది ఐపీఓ అధికారిక నిబంధనలు, SEBI మార్గదర్శకాలు, ఐపీఓ తుది ఆఫర్ డాక్యుమెంట్‌పై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
జియో ఐపీఓకు దరఖాస్తు చేసే ముందు అధికారిక ఐపీఓ డాక్యుమెంట్లలో వాటాదారుల రిజర్వేషన్, అర్హత తేదీ, దరఖాస్తు పరిమితులు. పాన్ కార్డు, డీమ్యాట్ ఖాతాకు వర్తించే నిబంధనలను ఇన్వెస్టర్లు పరిశీలించాలని నిపుణులు చెబుతున్నారు. దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా జియో రికార్డ్ సృష్టించనుంది. 3.8 బిలియన్ డాలర్ల నిధులను ఐపీఓ ద్వారా సేకరించాలని రిలయన్స్ లక్ష్యంగా పెట్టుకుంది. సెబీ నుంచి ఐపీఓకు ఇప్పటికే అనుమతి కూడా లభించింది. ఆగస్ట్ 298వ తేదీన అనుమతి లభించింది. దీని ద్వారా 27 కోట్ల వరకు కొత్త ఈక్విటీ షేర్లను జారీ చేయాలని రిలయన్స్ భావిస్తోంది.