దీపావళి వేళ మొబైల్ వినియోగదారులకు బంపర్ ఆఫర్.. రూ.149కే ఆన్‌లిమిటెడ్ రీఛార్జ్ ప్లాన్లు.. జియో, ఎయిర్‌టెల్‌లో ఇవే..

దీపావళి వేళ మొబైల్ వినియోగదారులకు శుభవార్త అందింది. ఎయిర్‌టెల్, జియో భారీ ఆఫర్ తీసకొచ్చాయి. వాయిస్ ఓన్లీ ప్లాన్లను ప్రవేశపెట్టాయి. ఈ ప్లాన్లలో ఆన్‌లిమిటెడ్ కాల్స్ సదుపాయం పొందవచ్చు. ట్రాయ్ ఆదేశాలతో ఈ కొత్త ప్లాన్లు అందుబాటులోకి తీసుకొచ్చాయి. రూ.149 నుంచి ఈ ప్లాన్లు మొదలవుతున్నాయి.

దీపావళి వేళ మొబైల్ వినియోగదారులకు బంపర్ ఆఫర్.. రూ.149కే ఆన్‌లిమిటెడ్ రీఛార్జ్ ప్లాన్లు.. జియో, ఎయిర్‌టెల్‌లో ఇవే..
Voice Only Plans

Updated on: Nov 05, 2026 | 9:42 AM

మొబైల్ వినియోగదారులకు దీపావళి సందర్భంగా భారీ ఊరట కలిగింది. పండుగ సందర్బంగా టెలికాం కంపెనీలు తక్కువ ధరతో కూడిన రీఛార్జ్ ప్లాన్లను తీసుకొచ్చాయి. ప్రముఖ టెలికాం సంస్థలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలతో పాటు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్ కూడా తక్కువ ధర టారిఫ్ ప్లాన్లను ప్రవేశపెట్టాయి. దీపావళికి ముందే వీటిని అందుబాటులోకి తీసుకొచ్చాయి. రీచార్జ్‌ల కోసం ఎక్కువ ఖర్చు పెట్టేవారికి దీనితో ఊరట కలిగినట్లయింది. టెలికాం నియంత్రణ సంస్థవ డాట్ ఆదేశాలతో కంపెనీలన్నీ వాయిస్ ఓన్లీ ప్లాన్లను ప్రవేశపెట్టాయి. వీటి ధర రూ.200లోపు ఉన్నాయి. మొబైల్‌లో ఇంటర్నెట్ అవసరం లేనివారికి ఇవి బాగా ఉపయోగపడనున్నాయి.

వాయిస్ ఓన్లీ ప్లాన్స్ వచ్చేశాయి..

ఇప్పటివరకు డేటాతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ రీఛార్జ్ ప్లాన్లు ఉండేవి. డేటా అవసరం లేనివారు కూడా ఈ ప్లాన్లను ఎంచుకుని రీఛార్జ్ చేసుకోవాల్సి వచ్చేది. దీని వల్ల డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చేది. అయితే డేటా అవసరం లేనివారి కోసం వాయిస్ ఓన్లీ ప్లాన్లను అందించాలని ఇటీవల డాట్ ఆదేశించింది. వెంటనే వీటిని అందుబాటులోకి తీసుకోవాలని టెలికాం కంపెనీలకు ఆదేశాలు జారీ ఇచ్చింది. ఈ ఆదేశాలతో టెలికాం సంస్ధలన్నీ కేవలం వాయిస్ కాల్స్ సౌకర్యంతో కొత్త రీఛార్జ్ ప్లాన్లను తీసుకొచ్చాయి. వీటి ప్రారంభ ధర రూ.149 నుంచే మొదలవుతుంది. ఇంట్లో వైఫై ఉన్నవారు, ఇంటర్నెట్ అవసరం లేదనుకునేవారు ఈ ప్లాన్లను ఎంచుకోవచ్చు. కేవలం ఇన్‌కమింగ్, అవుట్ గోయింగ్ కోసం ఫోన్లో సెకండ్ సిమ్ వాడేవారికి కూడా ఈ ప్లాన్లు యూజ్ అవుతున్నాయి.

వాయిస్ రీఛార్జ్ ప్లాన్లు ఇవే..

-రిలయన్స్ జియో రూ.147 ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 22 రోజులు మాత్రమే ఉంటుంది. అన్‌లిమిటెడ్ కాల్స్, 300 ఎస్‌ఎంఎస్‌లు ఉపయోగించుకోవచ్చు. 28 రోజుల ప్లాన్ ధర రూ.177, 30 రోజుల ప్లాన్ ధర రూ.196, ఒక క్యాలెండర్ ప్లాన్ ధర రూ.197గా నిర్ణయించింది

-ఇక 84 రోజుల వ్యాలిడిటీ రీఛార్జ్ ప్లాన్ ధర రూ.448గా ఉంది. ఇందులో అన్‌లిమిటెడ్ కాల్స్, వెయ్యి ఎస్‌ఎంఎస్‌ల సౌకర్యం అందుబాటులో ఉంటుంది

-336 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ధర రూ.1748గా ఉంది

-ఎయిర్‌టెల్ 28 రోజుల వాయిస్ ప్లాన్ ధర రూ.185, 30 రోజుల ప్లాన్ ధర రూ.203, క్యాలెండర్ నెల ప్లాన్ ధర రూ.206, 84 రోజుల ప్లాన్ ధర రూ.469, 365 రోజుల ప్యాన్ ధర రూ.1849గా ఉంది

-వొడాఫోన్ ఐడియా 25 రోజుల వ్యాలిడిటీ వాయిస్ ఓన్లీ ప్లాన్ ధర రూ.179, 28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ధర రూ.158, 30 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ధర రూ.203గా ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us