
Jan Dhan Accounts: ప్రస్తుతం దేశవ్యాప్తంగా జన్ ధన్ ఖాతాల్లో సుమారు రూ.2.75 లక్షల కోట్లు జమ అయ్యాయి. హైదరాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ASCI)లో జరిగిన కార్యక్రమంలో ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం. నాగరాజు ఈ విషయాన్ని తెలిపారు. ప్రతి జన్ ధన్ ఖాతాలో సగటున రూ.4,815 చొప్పున నిల్వలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఆయన తె లిపిన వివరాల ప్రకారం.. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ప్రారంభించినప్పటి నుండి, పెద్ద సంఖ్యలో ప్రజలు అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థలో చేరారు. ఇప్పుడు ఈ పథకం కింద 57 కోట్లకు పైగా ఖాతాలు ఉన్నాయి.
ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY) ఆగస్టు 2014లో ప్రారంభించారు. దేశంలోని ప్రతి ఇంటికి కనీసం ఒక బ్యాంకు ఖాతా ఉండేలా చూసుకోవడం, ప్రభుత్వ పథకాల నుండి నిధులు నేరుగా వ్యక్తులకు చేరేలా చూడటం దీని లక్ష్యం. ఈ పథకం కింద జీరో-బ్యాలెన్స్ ఖాతాలు ఉన్నాయి. డెబిట్ కార్డ్, ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం, ప్రమాద బీమా వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా ఖాతాలో ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Bank Holidays: ఈ వారంలో నాలుగు రోజులు బ్యాంకులు బంద్.. ఏయే రోజుల్లో అంటే..
గత కొన్ని సంవత్సరాలుగా, గ్రామీణ, పేద వర్గాలను బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానించడంలో జన్ ధన్ ఖాతాలు గణనీయమైన పాత్ర పోషించాయి. ఇది పొదుపును పెంపొందించిందని, ఆర్థిక లావాదేవీలలో పారదర్శకతను తీసుకువచ్చిందని ప్రభుత్వం విశ్వసిస్తోంది.
దాదాపు 78.2 శాతం జన్ ధన్ ఖాతాలు గ్రామీణ లేదా సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఉన్నాయని నాగరాజు వివరించారు. ఇంకా దాదాపు 50 శాతం ఖాతాలు మహిళల పేరిట ఉన్నాయి. దీనివల్ల గ్రామీణ కుటుంబాలు, మహిళలకు బ్యాంకింగ్ సదుపాయం బలపడిందని భావిస్తున్నారు.
ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలోనే ప్రత్యక్ష నగదు బదిలీ (DBT) ద్వారా వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద రూ.3.67 లక్షల కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమ చేసినట్లు నాగరాజు వివరించారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వ సబ్సిడీలు, పెన్షన్లు ఎలాంటి మధ్యవర్తులు లేకుండా పేదలకు చేరుతున్నాయని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి దోహదపడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇది కూడా చదవండి: High Court: భార్య అలా చేయడం క్రూరత్వమే.. హైకోర్టు సంచలన తీర్పు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి