iVOOMi e-Scooter: సింగిల్ చార్జ్ పై ఏకంగా 170 కిలోమీటర్లు.. పైగా రూ. 10వేల వరకూ డిస్కౌంట్..

|

Oct 13, 2024 | 4:57 PM

ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీదారు ఐవూమీ(iVOOMi) ఒక ఆఫర్ల సిరీస్ ను నడుపుతోంది. తన పోర్ట్ ఫోలియోలోని బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై అదిరే డిస్కౌంట్లను అందిస్తూ.. ఈ ఫెస్టివ్ సీజన్ ను సెలెబ్రేట్ చేస్తోంది. ఇప్పుడు అదనంగా మరో రూ. 10వేల డిస్కౌంట్ ను తన ఫ్లాగ్ షిప్ మోడళ్లపై ప్రకటించింది.

iVOOMi e-Scooter: సింగిల్ చార్జ్ పై ఏకంగా 170 కిలోమీటర్లు.. పైగా రూ. 10వేల వరకూ డిస్కౌంట్..
Ivoomi Jeet X Ze
Follow us on

పండుగల సీజన్ వచ్చిందంటే కొనుగోలుదారులకు నిజంగా పండగే. ఎందుకంటే అన్ని రకాల వస్తువులపై అన్ని ప్లాట్ ఫాంలలో అద్భుతమైన ఆఫర్లను అందిస్తుంటాయి. ఆటోమొబైల్ రంగంలోకూడా ఇదే ట్రెండ్ కొనసాగుతుంది. అన్ని రకాల కార్లు, ఆటోలు, బైక్ లపై తగ్గింపుల జాతర నడుస్తుంది. ఈ క్రమంలో ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీదారు ఐవూమీ(iVOOMi) ఒక ఆఫర్ల సిరీస్ ను నడుపుతోంది. తన పోర్ట్ ఫోలియోలోని బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై అదిరే డిస్కౌంట్లను అందిస్తూ.. ఈ ఫెస్టివ్ సీజన్ ను సెలెబ్రేట్ చేస్తోంది. ఇప్పుడు అదనంగా మరో రూ. 10వేల డిస్కౌంట్ ను తన ఫ్లాగ్ షిప్ మోడళ్లపై ప్రకటించింది.

పండుగ ఆఫర్‌లు, ప్రయోజనాలు..

ఈ పండుగల సీజన్ ను క్యాష్ చేసుకునేందుకు ఐవూమి ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తోంది. అందుకే వరుస ఆఫర్లు ప్రకటించింది. ఒకదాని తర్వాత మరొకటి సిరీస్ లాగా డిస్కౌంట్లను ప్రకటిస్తోంది. ఇప్పుడు తన ఫ్లాగ్ షిప్ లోని స్కూటర్లపై ఆఫర్ల వివరాలు పరిశీలిద్దాం..

జీత్ ఎక్స్ జెడ్ఈ: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ. 10,000 వరకు తగ్గింపును అందిస్తోంది.

ఎస్1 సిరీస్: ఈ స్కూటర్లపై రూ. 5,000 తగ్గింపును అందిస్తోంది.

ఈ పండుగ ఆఫర్లు అన్ని ఐవూమి డీలర్‌షిప్‌లలో పరిమిత సమయం వరకు అందుబాటులో ఉంటాయి. కంపెనీ సమాచారం ప్రకారం నవంబర్ మధ్య వరకు ఈ డీల్స్ అన్నీ అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది.

ఐవూమి జీత్ ఎక్స్ జెడ్ఈ స్కూటర్ అధిక రేంజ్ తో వస్తుంది. సింగిల్ చార్జ్ పై 170 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. అలాగే థర్డ్ జనరేషన్ ఐపీ67 డస్ట్, వాటర్ రెసిస్టెంట్ బ్యాటరీని కలిగి ఉంటుంది. మరోవైపు ఐవూమి ఎస్1 సిరీస్ పట్టణ వినియోగదారుల కోసం రూపొందించారు.

లోన్ ఆప్షన్లు..

ఐవూమీ ప్రముఖ ఆర్థిక సంస్థల భాగస్వామ్యంతో రుణ ఎంపికలను అందిస్తోంది.

జీరో డౌన్ పేమెంట్: స్కూటర్ కొనుగోలు చేయడానికి ఎలాంటి ముందస్తు ఖర్చు అవసరం లేదు.

0% వడ్డీ: రుణంపై వడ్డీ లేకుండా అసలు మొత్తాన్ని మాత్రమే చెల్లించొచ్చు. ఈఎంఐ నెలకు రూ. 1,411.

ప్రయోజనాల గురించి ఐవూమీ సీఈఓ, సహ-వ్యవస్థాపకుడు అశ్విన్ భండారి మాట్లాడుతూ తమ లక్ష్యం ఎల్లప్పుడూ స్థిరమైన మొబిలిటీని సరసమైనదిగా, అందరికీ అందుబాటులోకి తీసుకురావడమేనని చెప్పారు. పండుగల సీజన్ సమీపిస్తున్న తరుణంలో, ఆకర్షణీయమైన తగ్గింపులు, ఫైనాన్సింగ్ ఆప్షన్‌లతో భవిష్యత్ మొబిలిటీని తమ కస్టమర్లకు అందిస్తున్నట్లు వివరించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..