IT Department: మోసగాళ్లు ఎప్పుడూ కొత్త మార్గాలను అన్వేషిస్తూనే ఉంటారు. ఈ సారి గ్యాలం వేసేందుకు ఏకంగా ఆదాయపన్ను శాఖ పేరునే వినియోగించుకుంటున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఐటీ శాఖ నుంచి రిఫండ్స్ వచ్చాయంటూ లేక ఇతర మెసేజ్ లను పంపుతూ హ్యాకర్లు అమాయకులను బుట్టలో వేసుకునేందుకు కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మెసేజ్ లను ఫోన్లకు పంపి.. వాటికి స్పందించిన వారిని టార్గెట్ చేసుకుంటున్నారు. ప్రజలు ఇలాంటి వారి వలలో పడవద్దని ఆదాయపు పన్ను శాఖ ఇప్పటికే హెచ్చరిచింది. మెసేజ్ నిజమేననుకుని పొరపాటున జవాబు ఇస్తే సదరు వ్యక్తులు ప్రమాదంలో ఉన్నట్లేనని వారు సూచిస్తున్నారు.
ఆర్థిక లావాదేవీలు, ఇతర సమాచారాన్ని మోసగాళ్లతో పంచుకోవద్దని ఐటీ శాఖ హెచ్చరిస్తోంది. బ్యాంక్ అకౌంట్ నంబర్లు, పాన్, ఆధార్, సీవీవీ, డెబిట్ లేదా క్రెడిట్ కార్డు వివరాలను మెయిల్ ద్వారా పంపవద్దని వారు అంటున్నారు. ఇదే విషయాన్ని ఐటీ శాఖ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఉంచుతూ అవగాహన కల్పిస్తోంది. ఐటీ శాఖ పంపే మాదిరిగానే నేరగాళ్లు సైతం ఫేక్ మెసేజ్ లను పంపుతోందని వారు అంటున్నారు. వీటికి తోడు లాటరీలు తగిలాయంటూ మోసాలకు పాల్పడుతున్నారని ఐటీ శాఖ వెల్లడించింది. ఇన్కమ్ టాక్స్ శాఖలో ఉద్యోగాల పేరిట మోసాలు జరుగుతున్నాయని.. వాటితో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. అనధికారికంగా మోసగాళ్లు ఇస్తున్న అపాయింట్ మెంట్ లెటర్లతో జాగ్రత్తగా ఉండాలని వారు అంటున్నారు.
Beware of fraudulent messages being circulated in the name of Income Tax Department!
Please do not share your personal or financial details as the Department never asks for such details. https://t.co/UyXeItwRHk— Income Tax India (@IncomeTaxIndia) May 19, 2022