
IRCTC: ఇండియన్ రైల్వేకు చెందిన ఐఆర్సీటీసీ టికెట్ల బుకింగ్, ప్రయాణికులకు పుణ్యక్షేత్రాలకు సంబంధించిన ఆఫర్లే కాకుండా బహుమతులు గెలుచుకునే కార్యక్రమాలు సైతం చేపడుతుంటుంది. ఇక ట్రావెల్ చేసే వారికి ఓ బంపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఇండియన్ రైల్వేకుచెందిన ఆన్లైన్ బుకింగ్ విభాగం ఐఆర్సీటీసీ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ తీసుకువచ్చింది. ఇందులో మీరు లక్ష రూపాయల వరకు గెలుచుకునే అవకాశం ఉంటుంది. అయితే ఐఆర్సీటీసీ ప్రత్యేకమైన కాంటెస్ట్ నిర్వహిస్తోంది. ట్విట్టర్ వేదికగా ఐఆర్సీటీసీ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ కాంటెస్ట్‌లో భాగంగా మీరు వీడియో చేయాల్సి ఉంటుంది. ఇండియన్ రైల్వేస్ మీద, లేదంటే రైల్వేస్‌కు సంబంధించిన టికెటింగ్, కేటరింగ్, టూరిజం, ఎయిర్, చాట్‌బాట్, టూరిస్ట్ ల మీద వీడియోలు చేయవచ్చు.
https://corover.ai/vlog/ లింక్ ద్వారా మీరు ఈ కాంటెస్ట్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆ అవకాశం ఆగస్ట్ 31 వరకే అందుబాటులో ఉంటుంది. పోటీలో టాప్ 3లో నిలిచిన వారికి బహుమతులు అందజేస్తారు. మొదటి విజేతకు రూ.లక్ష, సర్టిఫికెట్, ట్రోఫీ అందిస్తారు. సెకండ్ ప్లేస్‌లో ఉన్న వారికి రూ.50 వేలు, సర్టిఫికెట్, ట్రోఫీ అందిస్తారు. మూడో స్థానంలో నిలిచిన వారికి రూ.25 వేలు, సర్టిఫికెట్, ట్రోఫీ అందిస్తారు. అయితే ఇందులో దాదాపు 300 మందిని విజేతలుగా ప్రకటిస్తారు. మిగిలిన వారికి రూ.500 గిఫ్ట్ కార్డు, సర్టిఫికెట్ లభిస్తాయి. ఒక వ్యక్తి ఒకటి కన్నా ఎక్కువ వీడియోలు సమర్పించవచ్చు. ఎంపికైన వీడియోలు ఐఆర్సీటీసీ అధికారిక ఛానల్స్‌లో అప్లోడ్ చేస్తారు. వీడియో నిడివి కనీసం ఒక నిమిషం ఉండాలి.