యుద్ధ సంక్షోభంలోనూ.. భారత్‌కు అండగా నిలిచిన ఇరాన్‌! ఇది కదా స్నేహమంటే..

దేశంలో ఎల్పీజీ కొరత కొనసాగుతున్న నేపథ్యంలో, ఇరాన్ ప్రభుత్వం రెండు భారతీయ ఎల్పీజీ ట్యాంకర్లకు స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ గుండా ప్రయాణించడానికి అనుమతించింది. ఈ నిర్ణయం భారతదేశానికి పెద్ద ఉపశమనం. ఇరాన్ రాయబారి ప్రకటన తర్వాతే ఈ అనుమతి లభించింది, ఇది ఇరు దేశాల మధ్య బలమైన స్నేహాన్ని చాటుతుంది.

యుద్ధ సంక్షోభంలోనూ.. భారత్‌కు అండగా నిలిచిన ఇరాన్‌! ఇది కదా స్నేహమంటే..
Iran India Relations

Updated on: Mar 14, 2026 | 6:30 AM

దేశంలో ఎల్పీజీ క్రైసిస్ కొనసాగుతున్న సమయంలో భారతదేశానికి కొంత ఊరట లభించింది. ఎల్పీజీని మోసుకెళ్తున్న రెండు భారతీయ ట్యాంకర్ షిప్స్ కు ఇరాన్ ప్రభుత్వం స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ గుండా ప్రయాణించడానికి అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయం భారతదేశంలో కొనసాగుతున్న ఎల్పీజీ కొరత పరిస్థితిని కొంత మేర తగ్గించవచ్చని భావిస్తున్నారు. ఈ అనుమతి ఇవ్వడానికి కొన్ని గంటల ముందే ఢిల్లీలోని ఇరాన్ అంబాసడర్ మొహమ్మద్ ఫతాలి మీడియాతో మాట్లాడారు. భారతదేశాన్ని ఇరాన్‌కు ముఖ్యమైన మిత్రుడిగా అభివర్ణిస్తూ త్వరలో సానుకూల పరిణామాలు కనిపిస్తాయని చెప్పారు. అనంతరం కొద్ది గంటల్లోనే భారతీయ ఎల్పీజీ ట్యాంకర్లు హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లేందుకు అనుమతి లభించింది.

ప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాల్లో ఎల్పీజీ కొరత కారణంగా ప్రజల్లో భయాందోళనలు కనిపిస్తున్నాయి. ఒకే గ్యాస్ సిలిండర్ కోసం వందలాది మంది గ్యాస్ స్టేషన్స్, గ్యాస్ ఏజెన్సీస్ వద్ద క్యూలో నిలబడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిలో ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం భారతదేశానికి కొంత రిలీఫ్ ఇవ్వవచ్చని భావిస్తున్నారు.

ఇండియా–ఇరాన్ సంబంధాలు

ఇరాన్ అంబాసడర్ మొహమ్మద్ ఫతాలి మాట్లాడుతూ ఇరాన్, ఇండియా మధ్య సుదీర్ఘకాల ఫ్రెండ్‌షిప్ ఉందని చెప్పారు. ఈ ప్రాంతంలో రెండు దేశాలకు కామన్ ఇంటరెస్ట్స్ ఉన్నాయని ఆయన తెలిపారు. క్లిష్ట పరిస్థితుల్లో భారత గవర్నమెంట్ ఇరాన్‌కు వివిధ సెక్టర్స్ లో సహాయం చేసిందని కూడా పేర్కొన్నారు. ఇక హెర్ముజ్‌ జల స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ప్రపంచంలోని అత్యంత కీలకమైన సీ రూట్స్ లో ఒకటి. ప్రపంచ ఆయిల్, గ్యాస్ ట్రాన్స్‌పోర్ట్ లో గణనీయమైన భాగం ఈ మార్గం గుండా జరుగుతుంది. ఈ మార్గంలో అంతరాయం ఏర్పడితే ప్రపంచ ఎనర్జీ మార్కెట్స్, ఇంటర్నేషనల్ ట్రేడ్ పై ప్రభావం పడుతుంది.

భారతదేశం కూడా పశ్చిమాసియా ప్రాంతం నుంచి పెద్ద మొత్తంలో క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది. అందువల్ల ఈ జలసంధి గుండా షిప్పింగ్ మూవ్‌మెంట్ సురక్షితంగా ఉండటం భారత ఆర్థిక వ్యవస్థకు చాలా కీలకం. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సంఘర్షణ నేపథ్యంలో గవర్నమెంట్స్, షిప్పింగ్ కంపెనీస్ ఈ ప్రాంత పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాయి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us