కొత్త కొత్త ఫోన్ల కోసం వెతికేస్తున్నారా.. వివిధ రకాల ఫోన్లు యూజ్ చేసి విసిగిపోయారా.. అయితే మీ కోసమే ఈ ఆఫర్. ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న Infinix.. ఇండియాలో Infinix 12 5G సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసేందుకు సిద్ధమైంది. కంపెనీ స్మార్ట్‌ఫోన్ మొత్తం స్పెక్ షీట్‌ను వెల్లడించనప్పటికీ, ట్విట్టర్ ద్వారా విడుదల తేదీని ప్రకటించింది. ఈ ఫోన్ ఇన్ఫినిక్స్ సిరీస్ లో నే మంచి ఫోన్ అయి ఉండవచ్చని సంస్థ వెల్లడించింది. Infinix Note 12 5Gను ఇవాళ (జూలై 8) న విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఇది ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేసేందుకు మాత్రమే అందుబాటులోకి ఉంటుందని ట్వీట్ లో పేర్కొంది. ఈ మోడల్‌లో 6.7 అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే, 108Mp ప్రైమరీ కెమెరా ఫీచర్లు ఉంటాయి. ఇన్ఫినిక్స్ విడుదల చేసిన చిత్రాలలో చూపిన మోడల్ 108MP ప్రైమరీ కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. కెమెరా మాడ్యూల్ దీర్ఘచతురస్రాకారంలో ఉంది. స్మార్ట్‌ఫోన్ ముందు ప్యానెల్‌లో వాటర్-డ్రాప్ నాచ్, కుడి ప్యానెల్‌లో పవర్ బటన్, వాల్యూమ్ రాకర్‌లు ఉన్నాయి. Infinix స్మార్ట్‌ఫోన్‌ను “థ్రిల్ & థండర్” అనే ట్యాగ్‌లైన్‌తో మార్కెట్ చేస్తోంది.
Thunder, feel the thunder. ⛈️⛈️⛈️
Lighting and the thunder. ⚡️⚡️⚡️ ఇవి కూడా చదవండిWell, feel #ThrillAndThunder with the new Infinix NOTE 12 5G Series! Launching on 8th July, only on Flipkart
Know more: https://t.co/BbU6lFOGkn pic.twitter.com/87drQoZHqS
— Infinix India (@InfinixIndia) July 4, 2022