గుడ్‌న్యూస్‌.. చక్కెర ధరలు తగ్గునున్నాయి! ఇక ఇంటి బడ్జెట్‌లో ఎంతో కొంత మిగులు..

గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అక్టోబర్, నవంబర్‌లలో భారతదేశ చక్కెర ఉత్పత్తి 43 శాతం పెరిగింది. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం చెరకు నుండి చక్కెర రికవరీ మెరుగుపడటం, మిల్లులలో వేగంగా క్రషింగ్ చేయడం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గుడ్‌న్యూస్‌.. చక్కెర ధరలు తగ్గునున్నాయి! ఇక ఇంటి బడ్జెట్‌లో ఎంతో కొంత మిగులు..
Sugar

Updated on: Dec 03, 2025 | 6:00 AM

అక్టోబర్‌లో ప్రారంభమైన చక్కెర సీజన్‌లోని మొదటి రెండు నెలల్లో దేశ చక్కెర పరిశ్రమ అనూహ్యంగా మంచి పనితీరును కనబరిచింది. దీంతో మీ ఇంటి బడ్జెట్‌పై కాస్త భారం తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. తాజా డేటా ప్రకారం.. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అక్టోబర్, నవంబర్‌లలో భారతదేశ చక్కెర ఉత్పత్తి 43 శాతం పెరిగింది. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం చెరకు నుండి చక్కెర రికవరీ మెరుగుపడటం, మిల్లులలో వేగంగా క్రషింగ్ చేయడం. ఈ పెరిగిన ఉత్పత్తి కారణంగా దేశంలో చక్కెర కొరత ఉండదు. పైగా చక్కర ధరలు కూడా భారీగా తగ్గే అవకాశం ఉంది.

ఇండియన్ షుగర్ అండ్ బయో-ఎనర్జీ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ISMA) నివేదిక ప్రకారం.. దేశంలోని మిల్లులు నవంబర్ చివరి నాటికి మొత్తం 4.1 మిలియన్ టన్నుల చక్కెరను ఉత్పత్తి చేశాయి. గత సంవత్సరం ఇదే కాలానికి ఈ సంఖ్య 2.88 మిలియన్ టన్నులు మాత్రమే. దేశంలో అతిపెద్ద చక్కెర ఉత్పత్తిదారు అయిన మహారాష్ట్రలో ఉత్పత్తి గత సంవత్సరంతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ పెరిగి 1.7 మిలియన్ టన్నులకు చేరుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని మిల్లులు కూడా మంచి పనితీరును కనబరిచాయి, ఉత్పత్తి 9 శాతం పెరిగి 1.4 మిలియన్ టన్నులకు చేరుకుంది.

మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లోని మిల్లులు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నప్పటికీ, దక్షిణ భారతదేశంలోని కర్ణాటకలో పరిస్థితి కొద్దిగా భిన్నంగా ఉంది, గత సంవత్సరం 8.12 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి 7.74 లక్షల టన్నులకు పడిపోయింది. ఈ తగ్గుదలకు ప్రధాన కారణం ప్రస్తుతం జరుగుతున్న రైతుల ఆందోళన. చెరకు ధరలను పెంచాలని డిమాండ్ చేస్తూ రైతులు నిరసనలు చేస్తున్నారు, దీని వలన మిల్లు క్రషింగ్ కార్యకలాపాలకు అంతరాయం కలిగింది, ఉత్పత్తిపై ప్రభావం పడింది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి