వినియోగదారులకు భారీ ఉపశమనం లభించింది. నవంబర్ నెలలో, రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 5.88 శాతానికి తగ్గింది. అక్టోబర్ 2022లో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 6.77 శాతంగా ఉంది. ఏడాది క్రితం నవంబర్ 2021లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.91 శాతంగా ఉంది. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం రేటులో భారీ తగ్గుదల ఉంది. ఆహార ద్రవ్యోల్బణం నవంబర్‌లో 4.67 శాతానికి తగ్గగా, అక్టోబర్‌లో ఆహార ద్రవ్యోల్బణం 7.01 శాతంగా ఉంది. అదే సమయంలో, నవంబర్ నెలలో పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ఆహార ద్రవ్యోల్బణం తగ్గింది. అంతకుముందు నెల ఇది 7.01 శాతంగా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర గణాంక కార్యాలయం (ఎన్ఎస్ఓ) సోమవారం కీలక గణాంకాలను విడుదల చేసింది. ఆహార పదార్థాల ధరలు తగ్గుముఖం పట్టడంతో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినా.. ఆర్‌బీఐ నిర్దేశించుకున్న సౌకర్యవంతమైన స్థాయికి పైనే ఉండడం గమనార్హం.
రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గడానికి ప్రధాన కారణం ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం రేటు తగ్గడం. ఆహార ద్రవ్యోల్బణం రేటు అక్టోబర్ 2022లో 7.01 శాతంగా ఉంది. ఇది నవంబర్‌లో 4.67 శాతానికి తగ్గింది. మరోవైపు అక్టోబర్‌లో పట్టణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 6.53 శాతం ఉండగా.. నవంబర్‌లో 3.69 శాతానికి తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 7.30 శాతం ఉండగా.. నవంబర్‌లో 5.22 శాతానికి తగ్గింది. ఆకుకూరలు, కూరగాయల ద్రవ్యోల్బణం -8.08 శాతానికి తగ్గింది. పండ్ల ద్రవ్యోల్బణం 2.62 శాతంగా ఉంది.
రిటైల్ ద్రవ్యోల్బణం రేటు ఆర్బీఐ టాలరెన్స్ బ్యాండ్ 6 శాతం ఎగువ స్థాయి కంటే దిగువకు దిగజారడం అతిపెద్ద ఉపశమనం అని చెప్పవచ్చు. ఆర్‌బీఐ 2 నుంచి 6 శాతం ద్రవ్యోల్బణం రేటును సహించమని నిర్ణయించింది. కానీ రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ టాలరెన్స్ బ్యాండ్ కంటే స్థిరంగా ఉంది. ఏప్రిల్‌లో, రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 7.79 శాతానికి చేరుకుంది. ఆ తర్వాత, ఐదు ద్రవ్య విధాన సమావేశాల తర్వాత ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఆర్బీఐ రెపో రేటును పెంచింది. రెపో రేటు 4 శాతం నుంచి 6.25 శాతానికి పెరిగింది.
ద్రవ్యోల్బణం తగ్గుతూనే ఉంటే.. రాబోయే సంవత్సరంలో వడ్డీ రేటు పెంపునకు బ్రేక్ పడవచ్చు. రెపో రేటు పెంపు ప్రక్రియ ఆగిపోవచ్చు. రిటైల్ ద్రవ్యోల్బణం రేటులో పతనం పెరిగితే వడ్డీ రేట్లు కూడా చౌకగా మారవచ్చు.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం