
ఈ రోజుల్లో బంగారం చాలా ఖరీదైనదిగా మారింది. ధర రోజురోజుకూ పెరుగుతోంది. భారతదేశంలో బంగారం ఆభరణాల రూపంలోనే కాదు, పెట్టుబడి మార్గంగా కూడా మారింది. అయితే బంగారానికి ఇంత డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో అసలు ఏ రాష్ట్రంలో ఎక్కువ బంగారం ఉందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. బంగారు తవ్వకం, ఉత్పత్తి విషయానికి వస్తే కర్ణాటక రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో ఉంది. దేశంలో తవ్విన మొత్తం బంగారంలో 99 శాతం కర్ణాటక గనుల నుండే వస్తుంది.
రాయచూర్ జిల్లాలోని హుట్టి బంగారు గనులు దేశంలోని పురాతనమైన, అత్యంత చురుకైన గనులలో ఒకటి. కర్ణాటకలోని కోలార్ బంగారు క్షేత్రం బంగారు ఉత్పత్తి పరంగా కూడా అత్యంత ప్రసిద్ధ గని. బంగారం ఉత్పత్తిలో కర్ణాటక అగ్రగామి రాష్ట్రం. కానీ అత్యధిక బంగారు నిల్వలు బీహార్ రాష్ట్రంలో ఉన్నాయి. బీహార్‌లోని, జిల్లాలో అత్యధిక బంగారు నిల్వలు ఉన్నాయని పరిశోధనలో వెల్లడైంది.
పరిశోధకుల అభిప్రాయం ప్రకారం జముయ్ జిల్లాలో వేల టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయి. ఇక్కడ ఇంకా పెద్ద ఎత్తున మైనింగ్ ప్రారంభం కాలేదు. భారతదేశంలోని చాలా బంగారు గనులు భూగర్భంలో ఉన్నాయి. ఈ బంగారాన్ని నేలను తవ్వడం ద్వారా తీస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి