
భారత్ ఇకపై కేవలం విదేశీ సహాయం పొందే దేశం కాదు. గత కొన్ని సంవత్సరాలుగా ఒక ప్రధాన ప్రపంచ శక్తిగా అవతరించింది. అనేక దేశాలకు ఆర్థిక సహాయం, రుణాలను అందిస్తోంది. బడ్జెట్ గణాంకాల ప్రకారం.. భారత్ నుండి అత్యధిక ఆర్థిక సహాయం పొందిన దేశం భూటాన్. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భూటాన్ దాదాపు రూ.2,068.56 కోట్ల సహాయం పొందింది. అయితే ఈ మొత్తం గత సంవత్సరం కంటే కొంచెం తక్కువ. 2023-24లో భూటాన్ కోసం సవరించిన సంఖ్య రూ.2,398.97 కోట్లు. భూటాన్ తర్వాత నేపాల్, మాల్దీవులు, మారిషస్ వంటి దేశాలు భారతదేశం సహాయ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి.
భూటాన్‌కు రూ.2,068.56 కోట్లు, నేపాల్‌కు రూ.700 కోట్లు, మాల్దీవులకు రూ.400 కోట్లు ఇచ్చింది. అదనంగా మారిషస్‌కు రూ.370 కోట్లు, మయన్మార్‌కు రూ.250 కోట్లు, శ్రీలంకకు రూ.245 కోట్లు కేటాయించారు. ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్రికన్ దేశాలు రూ.200 కోట్లు అందుకోగా, బంగ్లాదేశ్ రూ.120 కోట్లు, సీషెల్స్ రూ.400 కోట్లు, లాటిన్ అమెరికన్ దేశాలు రూ.300 కోట్లు అందుకుంటాయి.
మనం అనేక దేశాలకు రుణాలు ఇవ్వడంతో పాటు ఇతర దేశాల నుంచి మనం కూడా రుణాలు తీసుకుంటున్నాం. మార్చి 2020 చివరి నాటికి భారతదేశం బాహ్య రుణం దాదాపు రూ.558.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది ప్రధానంగా వాణిజ్య రుణాలు, NRI డిపాజిట్ల నుండి పెద్ద మొత్తంలో సహకారం కారణంగా ఉంది. COVID-19 మహమ్మారి సమయంలో భారతదేశం MSME రంగం, ఆరోగ్యం, విద్య వంటి కీలకమైన సేవలకు మద్దతు ఇవ్వడానికి ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు నుండి కూడా రుణాలు తీసుకుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి