Markets: గతవారం నష్టాల్లో ముగిసిన మార్కెట్లు ఈ వారం కూడా అదే మార్గంలో పయనిస్తున్నాయి. వారం ప్రారంభం రోజునే దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బెంచ్ మార్క్ సూచీ(Benchmark Indices) సెన్సెక్స్350 పాయింట్ల మేర నష్టాల్లో ప్రారంభం కాగా మరో కీలక సూచీ నిఫ్టీ(Nifty Index) సైతం 90 పాయింట్ల మేర నష్టపోయింది. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ 330 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 150కి పైగా పాయింట్లు కోల్పోయి ట్రేడ్ అవుతున్నాయి. దీనికి ప్రధానంగా అంతర్జాతీయ(Global) పరిణామాలే కారణంగా తెలుస్తోంది. ఆయిల్, గ్యాస్ రంగాలకు చెందిన కంపెనీలు ప్రధానంగా నెగెటివ్ లో ట్రేడ్ అవుతున్నాయి. అదానీ టోటల్ గ్యాస్ కంపెనీ ఎలక్ట్రిక్ మెుబిలిటీ మౌలిక సదుపాయాల కల్పన వ్యాపారంలోకి ప్రవేశించింది. జోయలూకాస్ భారత విభాగం ఐపీవో ద్వారా రూ.2,300 రూపాయలను సేకరించేందుకు సెబీ వద్ద DRHP దాఖలు చేసింది. ఇదే సమయంలో హ్యారియన్ పైప్ సంస్థ ఐపీవో ప్రైస్ బ్యాండ్ ను ఒక్కో షేరుకు రూ.144- రూ.153గా నిర్ణయించింది.
నిఫ్టీ సూచీలో బజాజ్ ఆటో 1.97%, అదానీ పోర్ట్స్ 1.34%, డాక్టర్ రెడ్డీ ల్యాబ్స్ 0.76%, స్టేట్ బ్యాంక్ 0.74%, ఏషియన్ పెయింట్స్ 0.71%, రిలయన్స్ ఇండస్ట్రీస్ 0.67%, కోటక్ మహీంద్రా బ్యాంక్ 0.47%, ఎయిర్ టెల్ 0.42%, గెయిల్ 0.37%, ఇండస్ ఇండ్ బ్యాంక్ 0.16% పెరిగి గాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఇదే సమయంలో.. ఇండస్ టవర్స్ 5%, టైటాన్ 3.61%, టెక్ మహీంద్రా 2.42%, లుపిన్ 2.36%, మారుతీ సుజుకీ 1.87%, సిప్లా 1.51%, ఇండియన్ ఆయిల్ 1.49%, హీరో మోటో కార్ప్ 1.40%, ఐచర్ మోటార్స్ 1.38%, హిందుస్థాన్ పెట్రోలియం 1.31% నష్టపోయి ప్రారంభంలో టాప్ లూజర్స్ గా నిలిచాయి.
ఇవీ చదవండి..
Minors Tax: మైనర్లు కూడా టాక్స్ చెల్లించాలా..? దానిని ఎలా లెక్కిస్తారో తెలుసుకోండి..
Lemon Juice: గర్భిణీ స్త్రీలు నిమ్మరసం తాగుతున్నారా ?.. అయితే ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే..