Stock Market: పాజిటివ్‌గా క్లోజ్ అయిన కీలక సూచీలు.. రాణించిన PSU బ్యాంకింగ్, మెటల్ షేర్లు..

|

May 26, 2022 | 4:45 PM

Stock Market: ఈ రోజు ఉదయం స్వల్ప లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఇంట్రాడేలో ఓలటైల్ గా ట్రేడ్ అయ్యాయి. చివరికి కీలక సూచీలు పాజిటివ్ లోనే క్లోజ్ అయ్యాయి.

Stock Market: పాజిటివ్‌గా క్లోజ్ అయిన కీలక సూచీలు.. రాణించిన PSU బ్యాంకింగ్, మెటల్ షేర్లు..
Stock Market
Follow us on

Stock Market: ఈ రోజు ఉదయం స్వల్ప లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఇంట్రాడేలో ఓలటైల్ గా ట్రేడ్ అయ్యాయి. అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వు తాజా ద్రవ్య విధాన సమావేశం తర్వాత US మార్కెట్లు నిన్న లాభాల్లోనే ముగిశాయి. దీనికి తోడు యూరప్ మార్కెట్లు కూడా నిన్న గ్రీన్‌లో ముగిశాయి. ఈ పాజిటివ్ సెంటిమెంట్ ఉన్నప్పటికీ ఆసియా మార్కెట్లు మిశ్రమంగా స్పందించాయి. ఈ క్రమంలో బ్యాంకింగ్‌, మెటల్‌, ఐటీ రంగాల షేర్లు గురువారం రికవరీ బాట పట్టడంతో స్టాక్‌ మార్కెట్లు పాజిటివ్ గా ముగిశాయి.

మూడు రోజుల నష్టాల పరంపరకు బ్రేక్ వేసిన బెంచ్ మార్క్ సూచీలు నిఫ్టీ- 50, సెన్సెక్స్ ఈ రోజు ముగింపు ట్రేడింగ్‌లో దాదాపు ఒక శాతం లాభంతో క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ- 50 సూచీ 145 పాయింట్ల లాభంతో 16,200 దగ్గర ముగియగా.. మరో కీలక సూచీ సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా లాభంలో ముగిసింది. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ 755 పాయింట్లు, మిడ్ క్యాప్ నిఫ్టీ 360 పైగా పాయింట్లు లాభపడ్డాయి. నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.8 శాతం పెరిగింది. ఇదే సమయంలో ఇండియా విక్స్ సూచీ 23 పాయింట్లకు పడిపోయింది.

నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ మెటల్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రైవేట్ బ్యాంక్ అన్నీ రెండు శాతానికి పైగా లాభపడటంతో నిఫ్టీ PSU బ్యాంక్ 3% లాభంతో సెక్టోరల్ ఇండెక్స్‌ల్లో ముందుంది. నిఫ్టీ FMCG మాత్రం ఫ్లాట్‌గా ముగిసింది. టాటా స్టీల్ 5% కంటే ఎక్కువ లాభాలతో టాప్ గెయినర్ గా నిలిచింది. ఇదే సమయంలో.. JSW స్టీల్, అపోలో హాస్పిటల్స్, HDFC బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంక్ ఇతర టాప్ కంట్రిబ్యూటర్లుగా ఉన్నాయి. కానీ.. యూపీఎల్, దివీస్ ల్యాబొరేటరీస్, సన్ ఫార్మా, ఆర్‌ఐఎల్, హిందుస్థాన్ యూనిల్వర్, డాక్టర్ రెడ్డీస్ కంపెనీలకు చెందిన షేర్లు మాత్రం మార్కెట్ పాజిటివ్ గా ఉన్నప్పటికీ నష్టాల్లోనే ముగిశాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి